పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

15


లాక్షణికులు రసౌచిత్యముల యుత్కర్షాపకర్షములను దెలుపుటకు కాళిదాసాది మహాకవుల గ్రంథములనుండి యుదాహరణములను గ్రహించిరి. కావున అటువంటి కావ్యములు పరిత్యాజ్యములు కావలయునా? బండి ఱాకును మేలు రాకును యతి ప్రాసమైత్రి గూర్చెనని అప్పకవివలె పోతన్నను దిట్టిపోసి భాగవతమును నీటఁ గలుపుదుమా ! ఏవో కొన్ని వ్యాకరణ విరుద్ధ ప్రయోగములను చేమకూర వెంకన్న యంగీకరించెనని యాతని విజయవిలాసమును, క్త్వార్థక ఇకార సంధులు గలవని ఆముక్తమాల్యదను మనము నిరాద రింతుమా! రసాస్వాదన నిమిత్తము కావ్యముఁ జదువువారికి నిటువంటి దోషములపై బుద్ది చొరదు, ఈలాటి భాషావిషయక దోషములకంటెను అనౌచిత్యము, నీరస కల్పనము మున్నగు రచనాలోపములు రమణీయతకు భంగము గలిగించును.

మమ్మటుఁడు కావ్యముల కిట్టి కఠినమైన బహిష్కార దండనము విధించునా? ఇది చింత్యము, పూర్వాపరముల యోచించినయెడల ఆయన యభిప్రాయమును మఱికొంత విరివిగ మనము తెలిసికొనవచ్చును. కావ్యప్రకాశికయందుఁ బ్రారంభముననే మమ్మటుఁడు కవి సృష్టి నిట్లు కొనియాడెను;

“నియతికృతి నియమ రహితాం
 హ్లాదైక మయీ, మనన్య
 పరతంత్రాం నవరస రుచిరాం,
 నిర్మితి మాదధతి భారతి కవేః"

ఇందలి యొకొక్క పదము నొకొక్క వ్యాసమునకు