పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

180

కవికోకిల గ్రంథావళి


వ్యావహారిక భాషావాదములోని సహేతుకత్వమును ఇప్పుడుఅందరును అంగీకరింపక తప్పినదికాదు.

ప్రపంచ వాఙ్మయములనెల్ల జీర్ణించుకొని తన శరీరమునకు కావలసిన నెత్తురు కండలుగ మార్చుకొనుటచేతనే ఆంగ్లేయ వాఙ్మయము నేడు అపరిమితముగ వృద్ధి చెందుచున్నది. విదేశ వాఙ్మయ సంబంధము నూత్న సృష్టికి ప్రతిబంధకము కాదు. ఒక వేళ అపూర్వసృష్టి ప్రేరకము కావచ్చును. ఇందుకు ఆంధ్రదేశమున సుమారు ముప్పది సంవత్సరములనుండి ప్రబలుచున్న అభినవ కవితోద్యమమె తగిన తార్కా ణ. ఆంధ్ర కవుల ప్రతిభానర్తకికి నూత్న నాట్యరంగముల నేర్పఱచిన తప్పేమి ?

అప్పారావుగారి ముత్యాలసరములతో అభినవకవితోద్యమము ప్రారంభమయినది. సంక్షుబ్ధసాగర కల్లోలములలో గాలివీచినట్లెల్ల కొట్టుకొనిపోవుచున్న అభినవ కవితా నావకు కట్టమంచి రామలింగారెడ్డిగారు కర్ణ ధారులై నిలిచిరి. వారు రచించిన కవిత్వ తత్త్వవిచారమను విమర్శన గ్రంథము ఈ నవీనోద్యమమునకు మార్గదర్శక మైనది. ఈ నవయుగ కవితా ప్రభాతముయొక్క ప్రథమరోచులు రాయప్రోలు సుబ్బారావుగారి కుటీర గవాక్షములో ప్రసరించి ఆయనను ప్రబోధించినవి. సుబ్బారావుగారు అంతకు పూర్వమే కవిత్వ మల్లు చుండిరి. ఆయన రచించిన 'లలిత ' యను ప్రథమ కావ్యము శబ్దాలంకారయుతమై పూర్వ ప్రబంధ శైలిని తలపించుచున్నను, అందే భావికవితా పరిణామముయొక్క సూచనలు పొడకట్టుచుండినవి. ఆకాలమున నెల్లరకు పూర్వ