పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

171


లకుగాని నేటి కవులకుగాని ఏలాటి యిబ్బంది కలుగుట లేదు. నవకవులకు మాత్రము ఈ బాధ యెందుకు కలుగవలయను?

ఒక వేళ నవకవులు నానార్థ రత్నమాలాది నిఘంటువులు మునిసిపాలిటీవారి చెత్తదిబ్బల స్టోరు అని అనుకొను పక్షమున ఆచెత్తదిబ్బలు మనము నడచు రాజమార్గమున లేవు. వానిని వెదకుకొని పోవువారికే కనబడును. ఆ చెత్త దిబ్బల భారము ఏకవియు మోయుట లేదు. అందులో నవకవులు తాము మోయుచున్నామనియు భరింపలేమనియు అనుకొందురేని అది వారి భ్రాంతి.

వాక్యమున కర్త కర్మ క్రియల అనుబంధానికి నవకవి విడాకు లిస్తున్నాడు. ఒక క్రియమాత్రం నిరంకుశంగా విహరిస్తే కొందరు కళ్ళు పొడుచుకోవడం ఎందుకని శ్రీ శ్రీ గారి ప్రశ్న, చిన్నయసూరిగారి బాల వ్యాకణాన్ని దండిస్తామని నవకవుల ప్రతిజ్ఞ . చిన్నయసూరిగారిని విమర్శింపవలసిన భాగములు వేరేవున్నవి. అవి కర్త కర్మ క్రియలలో కాదు. ఆ పని దక్షులైన పండితులు పూర్వమే చేసియున్నారు.

మనుష్యులు అన్యోన్యము మాటలాడుకొనుటకు తమ భావములను వెల్లడి చేయుటకు భాష పుట్టినది. మనము వాక్యములతో మాటలాడుకొందుము. ఒక వాక్యమునకు కనీసము ఒక కర్త ఒక క్రియ వుండుట అవసరము, ఈ నియమము అనుభవ జన్యమైన అక్కరవలన పుట్టినది.

ఒకప్పుడు ఇద్దరు మనుష్యులు మాటలాడు కొనునప్పుడు ఒక క్రియనే ఉపయోగించవచ్చును. “ఏంరా వస్తావా ?” అంటే “వస్తున్నారా” అనవచ్చు. అప్పుడు