పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

170

కవికోకిల గ్రంథావళి


శ్రీ శ్రీ గారి నవకవులకంటె సుబ్బారావుగారి నవ్యకవులె తెలుగు దేశమున ఎక్కువగ నున్నారు. అందుకు వారి రచనలే సాక్షులు.

శ్రీశ్రీ గారి Intro లో ప్రతి వాక్యము విమర్శకు పాత్ర మగునంతటి బలహీనముగా నాకు గోచరించినది. ఒక అక్షరమునకు లక్ష అర్థములుండిన కవులకు, ఏమి యిబ్బందిలేదు. ఒక మాటకు పది పర్యాయపదములుండిన ఏమీ చిక్కు లేదు. అవి అన్నియు వాడుకలో రూఢియైనవి కావు. నానార్థ రత్నమాలను ముందు పెట్టుకొని ఏకవి కవిత్వము వ్రాయడు. పూర్వము శ్లేష కావ్యములు వ్రాయుదినములలో అట్టి నిఘంటువులు ఉపయోగపడి యుండవచ్చును. ఇప్పుడెవ్వరు శ్లేషకావ్యములు ద్వ్యర్థి కావ్యములు వ్రాయుటలేదు. ఆ ప్రస్తావనయే అనవసరము,

నిఘంటువులో ఉన్నదన్న మాత్రమున కవి ఆ పదమును గ్రహింపడు, కవి గ్రహించుపదము శ్రవణ సుభగము గను తన భావము ప్రకటించునదిగను ఉండును. కావుననే తిక్కన “కావ్యంబు సరసులైన కవుల చెవులకు నెక్కినగాని నమ్మ డెందు పరిణతిగల్గు కవీశ్వరుండు” అని చెప్పెను. దీనిలో శబ్దసారళ్యము సౌకుమార్యము ధ్వనించుచున్నది. చెవికికూడ ప్రాధాన్యము. పింగళి సూరన “పొసగ ముత్తెపు సరుల్ పోహళించినలీల దమలోన దొరయు శబ్దములు గూర్చి” అని word harmony సూచించినాడు. నానార్థ నిఘంటువు లుండినందువలన, ఆంధ్ర మహాభారతము భాగవతము మున్నగు గొప్ప గ్రంథములను రచించిన పూర్వకవు