పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

కవికోకిల గ్రంథావళి


మార్పులు కలుగలేదు. ఏలయనగా అవి సార్వకాలీనములు, సార్వ లౌకికములు.

ఈ మూల సూత్రము లెట్టివి ?

యథార్ధమైన కవిత్వమునకు అనివార్యముగా ఛందస్సు అనుగతమౌను.

కవి ప్రతిభయే కవితకు ప్రాణము.

కవితా ప్రయోజనము సద్యఃపర నిర్వృతి. తక్కిన ప్రయోజనములు ఆనుషంగి ములు.

కవితయందు రసరామణీయకములు ప్రథానములు. తక్కినవి పోషకములు.

రసప్రతిబంధకములైన హేతువులు కావ్యదోషములు,

కవితాకళ జకదేకమైనది కావున దాని నిర్మాణ సూత్రములుకూడ జగ దేకములుగ నుండును. ఈమూల సూత్రములకుకూడ ఈనాడు చేటుమూడు అవస్థ వచ్చినట్లు సూచనలగపడు చున్నవి.

రాజకీయ విషయములలో Democracy ప్రవేశించి జనసామాన్యమునకు మేలుచేసినది. అట్లే వాఙ్మయములోనికినీ ప్రవేశించినది. ఉపకారమునకంటే అపకారమే చేసినది, ఎందుచేత ? రాజకీయమైన Democracy నియమబద్దము. వాఙ్మయములోని Democracy విశృంఖలము. ఆ డెమొక్రసి. తప్పుత్రోవ తొక్కినప్పుడు అధికారముగల ప్రజా ప్రతినిధుల చేతిలో కళ్ళెమున్నది. సరియైనదారికి త్రిప్పగలరు. వాఙ్మయములోని డెమొక్రసి తప్పుదారి పట్టినప్పుడు దానిని