పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

163


కాలేదు. అది మాత్రము ఎందుకు భగ్నము కాకూడదు అను భావములుగల ఒక వాఙ్మయ హిట్లరు పుట్టి యూరఫున ఒక విపరీతోద్యమము లేవదీయునేని దాని క్రొత్తందనము వలన మన దేశమునందుకూడ ప్రతిధ్వనులు పుట్టును. ఎద్దు ఈనినదనిన గాటకట్టివేయుమని చెప్పుటయేగదా యిప్పటి మన పరిస్థితి. జాతీయగౌరవము జాతీయ వ్యక్తిత్వము పరిస్పు టము కానంతవఱకు మనకీ యనుకరణ దురవస్థ తప్పదు, '

అయినను, కాలప్రవాహమున మార్పులు అనివార్య ములు. ఆంధ్రుల సాంఘిక జీవనమునందు వాఙ్మయమునందు కొన్ని మార్పులు కలిగినవి. వీరేశలింగంపంతులుగారు ఇంగ్లీషు రచనా మర్యాదలను తెలుగులో ప్రవేశపెట్టిరి. గురిజాడ అప్పారావుగారు గిడుగు రామమూర్తి పంతులుగారు వ్యావహారిక భాషోద్యమమునకు మూలపురుషులైరి. ఇట్టి మార్పులు నేటికాలపు తెలుగు కవితలో పొడచూపినవి. విస్మృతమైన పల్లెపదాలు మరల చెలామణియైనవి. ద్విపదకు గౌరవము కలిగినది. క్రొత్తఛందస్సులు పుట్టినవి. "ఆంగ్లేయుల కావ్య మర్యాదలు ఆకృతులు మన కావ్య పద్దతులందు కొన్ని మార్పులు కలిగించినవి. ఖండకావ్యములు ప్రముఖములైనవి. కవితావస్తువునందు మార్పు కలిగినది. నవలలు ఉపకథలు పుట్టినవి.

ఆఫీసుకు పోవునప్పుడు కోటు బూటు హ్యాటు తగిలించుకొని యింటికి వచ్చినతర్వాత ఎప్పటివలె ధోవతి తుండు గుడ్డతో ఉండినట్లే ఈ మార్పులన్నియు బాహిరములే, కవితాంత రంగమున, కవితా మూల సూత్రములలో