పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

162

కవికోకిల గ్రంథావళి


కొన జాలము. అది క్రొత్త ఉద్యమము కావచ్చు, కాని ఆ చిత్రములను మెచ్చుకొనుటకు మనకు కూడ అస్టిగ్మాటిజం అను కంటిజబ్బు రావలయును. కొన్ని ఉద్యమములు ఇటువంటి అసామాన్య ప్రకృతులకును కాలమునకును సంబంధించినవి. Cubism, Dadaism, Futurism, Impressionism అను చిత్ర లేఖన పద్దతులు కూడ abnormal psychology కి సంబంధించినవే. యుద్దమందు చూచిన రక్తపాతము, ఘోరత్వము మృత్యువు ఈలాటి మార్పులకు కారణమై యుండును. True, it is a ghostly Company: Expressionistic cubistic shapes, the forms of Futurism, moving and caught in movement: Pictures of horror and protest which have arisen out of the great Death of war.

జర్మనీలో ఈ చిత్రముల సంత పెట్టినప్పుడు దానిని బహిరంగపఱచుచు అధ్యక్షుడు ఇట్లు చెప్పినాడు: Cubism, Dadism, Futurism, Impressionism and the rest have nothing in common with our German people For all these notions are neither old nor are they modern. They are simply the artificial stammering of people whom God has denied the boon of genuine artistic talent and given instead the gift of prating and deception ఈలాటి విపరీత కళాచాపల్యము వారికే నచ్చలేదు. ఇక అటువంటి పరిస్థితులు లేని మనకెట్లు సంతోషము కూర్చును.

ప్రస్తుతపు మహాసంగ్రామము ముగిసిన తర్వాత కూడ శ్మశానవాటికయైన యూరపునందు విపరీతోద్యమములు పుట్టవచ్చును. ఈ యుద్ధమునందు ఇండ్లు ఆస్తులు ప్రాణములు బాతుల స్వాతంత్ర్యము నాశనమైనవి. వాఙ్మయము భగ్నము