పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

165


మరలించు కళ్ళెము చేతపట్టుకొన్న ప్రతినిధులు లేరు. అందువలన ఈ డెమొక్రసీ యింతవరకు విశృంఖలముగానే ప్రవర్తించుచున్నది.

తెలుగు కవితలో నేడుజరుగు మార్పులలో ఛందోబద్దముకాని వచనపు తుంటలను వ్రాసి దానిని కవిత్వమని నామకరణము చేయుట ఒక పెద్దమార్పు. ఈ నావెల్టి తెలుగులో క్రొత్తగా ప్రవేశించినది. ఈ కవిత్వము వ్రాయువారు, ఏ డెనిమిదిమంది నవకవులు. మనదేశములో ఈకవిత్వము కూడ ఒక ప్రతిధ్వని. ప్రతిధ్వనులు ప్రతిఫలించిన కాంతులు సారభూతములు కావు. అనుభూతి జన్యములును కావు.

అమెరికా దేశమున Walt Whitman అను నతడు Leaves of grass అను గ్రంథమును రంచిచెను. దానికి Verse libre అని పేరు పెట్టినారు. అనగా Free verse __ ఛందోబద్దముకాని పద్యము. ఈ పద్యములు అమెరికాలోకంటె ఇంగ్లాండులో ప్రజల మనస్సుల నాకర్షించినవి. కారణమేమనగా, వానిలో ఛందస్సు లేనందువలనకాదు, అమెరికా దేశస్తుల Democratic భావములు సర్వమానవ సౌభ్రాత్రము విశాలమైన Cosmopolitanism ఆపద్యములలో అద్దమునందు ప్రతిబింబమట్లు ఇంగ్లీషువారికి గోచరించినది. ఆ భావములు అందర హృదయములను ఉద్దరింపగల సమర్థములు. నేనా గ్రంథమును మొట్ట మొదట చదివినప్పుడు ఇటువంటి మహోన్నత భావములు ఛందోబద్ధమైయుండిన మఱెంత రమణీయముగా నుండెడివో యని తలంచితిని.