పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

161


వ్యక్తిత్వమున్నది. జాతీయ సంప్రదాయములలో వేరు నాటు కొననిదే ఏదైనను చిర కాలముండదు.

1914 వ సంవత్సరమున ప్రారంభమైన ప్రపంచ యుద్ధము ముగిసిన తర్వాత యుద్ధ విచ్ఛిన్నమైన యూరపు దేశమునందు ఎన్నో వాఙ్మయోద్యమములు, పుట్టగొడుగులవలె పుట్టి పరిస్థితులు కొంచెము మారునప్పటికి, నశించినవి. వాని ప్రతిధ్వనులు మన దేశమునకూడ వినబడినవి.

చిత్ర లేఖనమున 'క్యూబిజం' (Cubism) అను పద్దతి ఫ్రాన్సు దేశమున పుట్టి ఇంగ్లాండు జర్మనీలకు వ్యాపించినది. 'క్యూబిజం' అనగా మనము చూచు ప్రతివస్తువు Cubes గా అగపడునట్లు చిత్రించుట, ఇది మన యింద్రియజ్ఞానమునకు అనుభూతికి అతీతమైనది. జగదేకమైన భావమును, సార్వజనీ నానుభూతిని కవిగాని చిత్రకారుడుగాని వ్యక్తిగతమైన భావ సౌందర్యముతో మేళవించి అందరకు రుచించునట్లు ఆకృతి బద్దము చేయగలడు. కాని తనకు మాత్రమే అనుభూతమైన దానిని ఏ కవికూడ జగదేకము చేయలేడు. ఈ క్యూబిజము గతి కూడ అట్లే అయినది.

అస్టి గ్మాటిజం (Astigmatism) అను కంటిరోగము అందరకు లేదు. ఆ జబ్బు ఉండువారికి రస్తా హెచ్చు తగ్గులుగా కనబడును. అది రోగమని తెలియక , స్పర్శేంద్రియ జ్ఞానము కూడ లేనియెడల అట్టివానికి ప్రపంచము మిట్టపల్లములుగా కనబడును. అట్టివాడు చిత్రలేఖకు డయ్యెనేని తన చిత్రములలో సమతలముండదు. అట్టి చిత్రములను మనము మెచ్చు