పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/166

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

160

కవికోకిల గ్రంథావళి


ఎగిరిపోవును. గట్టిగింజలు మాత్రము నిలిచి ఉండును, ఇది మానవులకు కొంత సంతృప్తి.

ప్రాణములేని యంత్రమునందు ఆజ్ఞాతృణీకరణము శాసనోల్లంఘనము లేదు. ఒక్కసారి తాళము త్రిప్పిన గడియారము ఏమీ మార్పులేక 24 గంటలు నడచును. ప్రాణముకలిగిన జంతువులో ఇటువంటి యాంత్రిక ప్రవృత్తి లేదు.

నిర్బంధ విమోచనము భావదాస్య విముక్తి కలిగిన ప్రథమ దశలో, స్వాతంత్ర్యము విశృంఖలత్వముగ భావింప బడును. విశృంఖలత్వము నాగరిక స్వాతంత్ర్యము కాదు. అది నయాగరా ప్రవాహ పాతమువంటి అసంయమిత శక్తి. దానిని నియమబద్దము కావించినప్పుడే జనోపకారి యగును.

స్వాతంత్ర్యము నియమరహితమైనది కాదు, ప్రజూ ప్రభుత్వము (Democracy) శాసనబాహ్యమైనది కాదు. రెంటికిని నీతులు నియమములు బాధ్యతలు కలవు.

మానవుడు బహువిధములైన భోజన పదార్థములను జీర్ణించుకొని వానికంటె భిన్న మైన తన శరీరమును పోషించు కొనునట్లే ఒక జూతికూడ ఇతరదేశ నాగరకతలలోని ఉత్తమ ధర్మములను తనలో జీర్ణింప జేసుకొని సాంఘిక శరీరమును పెంపుచేసుకొను చున్నది. తన దేహతత్త్వమునకు వికటించిన పదార్దములను వెడలగ్రక్కు చున్నది. ఒకప్పుడు ఇతర దేశములకు జాతులకు వాని పరిస్థితులకు అనువైన వెన్నో మనకు సరిపడకపోవచ్చును. ప్రతి జాతికి ఒక జాతీయ