పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

కవికోకిల గ్రంథావళి

తారకాభరిత గగనము, సముద్రము, " మహోన్నత పర్వతపంక్తులు మున్నగు ప్రకృతి విశాల గభీర రమణీయ సృష్టులకు ఉపమానములు లేవు. అయినను కవులు వానిని అంతకంటెను తక్కువ రమణీయములైన వస్తువులతో సరిపోల్చియున్నారు. విశాలమైన దృశ్యమును మనస్సు ఆకళించు కొని అనుభవించ లేదు. ఆ దృశ్యమునే చిత్రకారుఁడు పరిమితమైన భిత్తిపై చిత్రించినప్పుడు చూచి అనందింతుము, ఎందు వలన? ప్రకృతి దృశ్యముయొక్క వైశాల్యము అనావశ్యకములైన వివరములు ఇందుండవు. ఆవరణము సంకుచిత మగును. చిత్రము. అన్ని మూలలు ఏకకాలమున చూచి ఆనందింపగలయంత పరిమితమైయుండును. కవులుకూడ కొంచె మించుమించు ఈమార్గమునే యవలబించిరి.

“నవది ముకులితాక్షీం రుద్రసంరంభభీత్యా
  దుహితర మనుకుంప్యా మద్రిరాదాయ దోర్భ్యాం
  సురగజ ఇవ బిభ్రత్ పద్మినీం దంతలగ్నాం
  ప్రతిపథగతి రాసిద్యోగ దీర్ఘీకృతాంగః "

రుద్రసరంభ భీతిచే కన్ను మోడ్చిన పార్వతిని హిమవంతుడు మోసికోనిపోవుటను కాళిదాస మహాకవి అద్భుతముగ వర్ణించెను. అది పార్వతిని మోసికొని పోవుట ఊహించుట కష్టము. అద్రిని సురగజమునకును మూర్చపోవు చున్న పార్వతిని, పెళ్ళగించుటవలన యించుక వాడి దంత లగ్నమైన తామర తీవకును పోల్చి, పరిమిత దృశ్యముగ మార్చి అనుభవింపదగిన రమణీయతను, కవి సృజించినాడు.