పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అలంకార తత్త్వము

155

“అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో
              నామ నగాధిరాజః
  పూర్వాపరౌ వారినిధీ విగాహ్య స్థితః పృథిన్యా
              ఇవ మానదండః.”

ఇందు హిమవత్పర్వతమును కొలగఱ్ఱకు పోల్చుటలో కవి ఏ విధమైన సౌందర్యమును నర్థించెనో నాకు గోచరించుట లేదు.

కొన్ని మాసములు అలంకారములు నిత్యపరిచితములయి యొకవిధమైన తిరస్కారభావము కొల్పుచుండును. పద్మనేత్ర, లతాంగి, శంపాలతాంగి అను సమాసములు కేవలము స్త్రీ, పర్యాయపదములైనవి, పద్మనేత్ర యన్నంతనే యేదోయొక స్త్రీయని దాటిపోదుము. కాని ఒక్క క్షణమైన ఆగి ఆ నేత్రపద్మముల సౌందర్యమును మన హృదయమున చిత్రించుకొనము. కావున కవిత్వములోని సౌందర్యమును మన మనుభవింపవలసినంత యనుభవించుట లేదు.

అలంకార తత్త్వమును వాని ప్రయోజనమును గుర్తెఱిగినచో అలంకారము లావశ్యకములా కావా యను చర్చలకు దిగ నవసరము లేదు. ప్రతిభావంతులగు కవుల రచనలందు అలంకారములు ఆవశ్యకములగు చోటుల అప్రయత్నపూర్వకముగనే దొరలును.

వాల్మీకి మహాకవికి పూర్వము అలంకార గ్రంథము లుండి యుండవు, క్రౌంచపక్షిశోకము హేతువుగా కవిత్వము శ్లోకరూపమున ప్రవహించినది. ఆయన యుపయోగించిన యలంకారములన్నియు భావ ప్రకటనావశ్యకతా సంభవ