పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అలంకార తత్త్వము

153

నఖలు నఖలు బాణా! నన్నిపాత్యోయ మస్మిన్
మృదుని మృగశరీరే పుష్కరాశా వివాగ్ని ॥

రాజులు మృగయా ప్రియులు, వేట యందు కరుణా రహితులు కూడ. అట్టివారిని మృగమును చంపవద్దనిన ప్రయోజనమేమి ? రాజు హృదయమున కారుణ్యము పుట్టింప వలయును. ఈ మృగము మృదువైన శరీరముగలది బాధ కోర్య జాలదు.. బాణప్రయోగము చేయకుడు అని వైఖానసు లందురేని రాజు సరకు చేసియుండడు. కాని మృదువై న మృగశరీరము పుష్పరాశికిని బాణము అగ్నికిని పోల్పబడినది. రాజూ నీవు జింకపై బాణము వేసిన పూలరాశిలో నిప్పు పెట్టినట్లైసుమా అని వైఖానసులు చెప్పినట్లైనది. రాజునకు తన క్రూర కార్యముయొక్క ఘోరత్వము హృదయమున సూటిగా నాటినది. జింక బ్రతికినది. కవి మృదు అను విశేషణములోని సామాన్యభావముతో పుష్పరాశిలోని సుగుణము లన్నియు మేళవించి అపూర్వమును హృదయంగమము నైన మార్దవమును మృగశరీరమున కాపాదింపజేసెను.

కంటి కగుపడని ఉపమేయమును అగుపడు ఉపమానముతో పోల్చుదుమేని భావమున కాలంబము దొరికి బోధ సులభమగును, “వాని మనస్సు కాసార జలమువలె స్వచ్ఛముగ నున్నది”. మనస్సు అదృష్టము, జలము దృష్టము, ఉపమాన సహాయముచేత ఉపమేయము నూహింపగలము. ఇట్లుగాక విపరీతమయ్యెనేని ప్రయోజనముండదు ఉపమానము ఆత్న గుణసంయోగము వలన ఉపమేయమును శోభింపఁ జేయునదిగ నుండవలయును,