పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

కవికోకిల గ్రంథావళి

సీ|| నెత్తమ్మిరేకుల మెత్తఁదనము దెచ్చి
            యచ్చున బెట్టినట్లంద మొంది;
     చక్రవాకంబుల చందంబు కొనివచ్చి
            కుప్పలుచేసిన ట్లొప్పుమెరసి,
      చందురుననుఁ గాంతికందేర్చికూర్చి బా
            గునకు దెచ్చిన యట్లు కొమరు మిగిలి
      ఆళికులంబుల కప్పుగలయంతయును దెచ్చి
             నారువోసిన భంగి నవక మెక్కి

     అంఘ్రితలములు కుచములు నాననంబు
     కచభఠంణును నిట్లున్న రుచిరమూర్తి
     అనుపమానభోగములకు నాస్పదంబు
     గాదె....................

ఒక నెత్తమ్మిరేకుల మెత్తందనము చాలదు. లోకములోని నెత్తమ్మిరేకుల మెత్తందనము తెచ్చి కరువుపోసినగాని అతడు భావించిన మెత్తదనమునకు సరిపోదు. ఈ భావ ప్రగాఢత్వము ఇంతకన్న తక్కువగా చెప్పుటెట్లు? సామాన్యమైన మాటలు చాలనప్పుడు కవికి అలంకారమే శరణ్య మని Newman వచించెను:

(Poetry) from living thus in a world of its own, it speaks the language of dignity, emotion, and refinement, Figure is its necessary medium of communication with man; for in the feebleness of ordinary words to express its ideas, and in the absence of terms of abstract perfection the adoption of metaphorical language is the only poor means allowed it for imparting to others its intense feelings (Newman).

దుష్యంతుడు కణ్వాశ్రమ ప్రాంతమున వేటాడుచు ఆశ్రమ కురంగముపై విల్లెక్కు పెట్టు సమయమున వైఖానసు లిట్లనిరి: