పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/146

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

140

కవికోకిల గ్రంథావళి

ఈవిషయమును ఎడ్ గార్ యాలన్ పో అను అమెరిగా కవీంద్రుఁడు ఇట్లు చెప్పియున్నాడు :

"In the hands of the true artist the theme is but a mass of which anything may be fashioned at will or according to the skill of the workman. The clay is, in fact, the slave of the artist. It belongs to him.”

రామాయణము, మహాభారతము ప్రసిద్ధములైన కావ్యేతిహాస గ్రంథములు. ఇవి చారిత్రకములని విశ్వసించు వారు అప్పటికిని ఇప్పటికిని గలరు. అట్టికథల తీసికొనినాటకములు రచించిన భాసుఁడు, కాళిదాసు. భవభూతి, భట్ట నారాయణుఁడు మున్నగు కవులు మూలకథలను ఎట్లుమార్చినదియు మన మెఱుంగుదుము. షేక్ స్పియరు తాను రచించిన చారిత్రక నాటకములోని పాత్రలను యథార్థచారిత్రక పురుషులకంటె భిన్నమైన స్వభావశీలములు గలవారినిగ చిత్రంచెను. ఇది ఆవశ్యకమైన యొక శిల్పలక్షణము. తెల్లని కాగితముపై నల్లనిగీఁతయు నల్లని కాగితముపై తెల్లని గీఁతయు గీచిన స్ఫుటముగ నగపడును. ఏకవర్ణ మయ్యెనేని రెండిటికింగల భేదము గోచరింపదు. అందువలననే కవియు చారిత్రక నాటకములందు సైతము వివిధప్రకృతులు గల వారిని ఒక చోట ప్రవర్తింపఁ జేసి, స్వభావ తారతమ్యమును స్ఫురింపఁ జేయును.

నాటకమునందు కధకంటెను మానవస్వభావ చిత్రణమె ముఖ్యము. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది చిత్తవికారములు సర్వజనీనములై , సర్వ కాలీన