పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/147

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకము : చరిత్రము

141


ములై, మానవసంఘముపై నధికారము సల్పుచుండును. అట్టి మానవ స్వభావ శీలములను, మానసిక రహస్యములను కవి నాటకరంగమున మూర్తీభవింపఁజేసి సామాజికులను ఆనందపరవశులఁ గావింపవచ్చును.

“Poetical works belong to the domain of our permanent passions; let them interest those, the voice of all subordinate claims is at once silenced,”

అని శాశ్వతములగు మనోవికారముల ప్రాముఖ్యమును మ్యాథ్యూ ఆర్ నాల్డు కవి వివరిం చెను.

ఒకప్పుడు ఫ్రెంచినాటక రచయితయగు మోలియర్ కవిని విమర్శకులు, “నీ నాటకములు లక్షణవిరుద్ధముల”ని తూలనాడిరఁట. అందుకు “సామాజికులను సంతోష పెట్టుటకు ఏ నాటకలక్షణము లావశ్యకములో అంతకన్న భిన్నములైన లక్షణములతో నాకేమిపని?” అని ఆయన జవాబు చెప్పెనఁట ! నాట్యకళా ప్రపూర్ణుఁడగు బళ్ళారి టి. రాఘవాచార్యుల వారు ఒక యుత్తరమున, "నేను నాటకమును సామాజికులదృష్టితో చదివెదను.” అని వ్రాసియుండిరి. నాటక యోగ్యతను ఒరయుటకు ఇంతకన్న శ్రేష్ఠమైన నికషోపలము మఱియొక టి యుండదని నా యుద్దేశము.

చరిత్రయొక్కయు, నాటకము యొక్కయు ఉద్దేశములు ప్రయోజనములు వేఱు; చరిత్ర జరిగినది జరిగినట్లుగ చెప్పును. జరిగిన దన్నంతమాత్రముననే సకల సబ్బండును చరిత్రకారుఁడు గ్రంథస్థము చేయును. మంచిచెడ్డల ననుసరించి అతఁడు విషయములను ఏర్పఱచకూడదు. ఎంతవఱకు