పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకము : చరిత్రము

139

నట్లుగను, వాఖ్యాన ప్రాయముగను పరాసు మహాకవి అద్భుత నవలా రచయిత విక్టరు హ్యూగో ఇట్లు వ్రాసెను:

“It seems to us that someone has already said that the drama is a mirror where in nature is reflected. But if it be an ordinary mirror, a smooth and polished surface, it will give only a dull image of objects with no relief, faithful but colourless; everyone knows that colour and light are lost in a simple reflection. The drma, therefore, must be a concentrating mirror, which, instead of weakening, concentrates and condenses the coloured rays, which makes a mere gleam a light, and of a light a flame. Then only is the drama acknowledged by art."

నాటకవస్తువు పౌరాణికమైనను, చారిత్రకమైనను, సాంఘికమైనను కవి తన భావనాగ్నిచేత కరగించి పరిశుద్ధము చేసి, కల్పనాశ క్తియను అచ్చులో అసామాన్యమూర్తిని తయారుచేయును. ఈమూర్తి ప్రకృతికంటె భిన్నముగ నున్నను, దానికి వ్యతిరేకముగ నుండదు. ఇట్లనుటచేత కధను తమ కల్పనకు అనుకూలముగ మార్చవలసిన ఆవశ్వకము కవికి కలదు కార్యకారణ సంబంధము నాటకమున పరిస్పుటముగనో, వ్యంగ్యముగనో గోచరింపవలయును; ఏదియును కారణరహితముగ సంభవింపఁ గూడదు. కావున, కవి ఆది మధ్యాంతములుగల నాటకమును సృజించునప్పుడు, కథలో నెన్నియో మార్పులు చేయవలసియుండును. కవిచేతి కావ్యవస్తువు ప్రతిమాకారుని చేతి బంకమట్టి వంటిది.