పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

కవికోకిల గ్రంథావళి

గైదు దినములవఱకు ఏకధారగా ఆవరించియుండు. ఇటువంటి యున్మాదావస్థను, సూక్ష్మ మానిసిక ప్రళయమును ఆనంద మందుమా! బాధయందుమా? ప్రసవ వేదనపడుచుండు తల్లిని చూచి, “ఈమె యెంత ఆనంద మనుభవించుచున్నది! ” అని తలంచువా రుందురా? ప్రసవించిన తదుపరి తల్లి బిడ్డను చూచుకొన్నపుడు ఆనందమనుభవించును. ప్రాసెస్ ఎప్పటికి ఆనందకరముగ నుండదు. ప్రాసెస్ ను రిజల్టును కల గుమ్మటం చేయుటవలన ఈ భ్రాంతి కలుగుచున్నది.

మానవావస్థానుకృతి అభినయము. అభినయము ప్రధానముగాఁ గలది నాట్యము. నాటక రచయిత ప్రకృతిని యథాతథముగ అనుకరింపఁడు, సామాన్యముగ మానవ జీవితమునందు సంభవించు ప్రతి సంఘటనము, ప్రతివిషయము కళయందు మూర్తీభవింపఁ జేయుటకు తగినంత ముఖ్యమైనది గను, ఆవశ్యక మైనదిగ నుండదు. ప్రకృతిపరిపాలనమునందు శక్తి అనవసరముగ వ్యయింపఁబడుచుండును. కవి కళాదృష్టితో అనావశ్యకములైన వివరములు వదలిపెట్టి, ఏర్చి కూర్చి, చేర్చి తీర్చి, కొన్ని సంవత్సరముల కాలపరిమితిగల కథను మూడు నాలుగు గంటలలో ముగియు నాటకముగ నిర్మించును. ప్రకృతి అంతగ పాటింపని పొదుపును కవి జూగరూకతతో అభ్యసించును. కొంచె మించుమించు నాటకము ప్రకృతియొక్క యుత్తమ పునర్నిర్మాణమని చెప్పవచ్చును.

“అద్దములోవలె ప్రకృతిని (నాటకములందు) ప్రతిఫలింపఁజేయుట” అను షేక్‌స్పియరు సూక్తికి మెఱుఁగుపెట్టి