పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటకము : చరిత్రము

135


తీఱిక గాని యసలే లేదు. అయినను ఈ విషయము చాల ముఖ్యమని నాకు తోఁచినందువలన, సారస్వత ప్రపంచమున పలుకుబడి కలవారు ఒకప్పుడు పొరపడుదురేని (పొరపడుట మానవ సహజమేగద!) ఆ పొరపాటు తత్త్వదర్శనమునకును, సారస్వత పురోభివృద్ధికిని ఆటంకముగ ఏర్పడవచ్చునను భయముతో ఈ వ్యాసమును వ్రాయఁదలపెట్టితిని.

దృశ్య శ్రవ్య కావ్యములకు రచనా విధానమునతప్ప అంత్య ప్రయోజనమునందు ఏవిధమైన భేదము లేదు. లలిత కళల ప్రయోజన మేదో దృశ్యకావ్య ప్రయోజనముకూడ నదియె—సద్యఃపర నిర్వృతి

నాటకము సామాజికుల రసానుభూతికి హేతువయి, హృదయాహ్లాదము, వినోదము కలిగించిన చాలునా? లేక, యింక నేదియైన సాంఘిక ప్రయోజనమును, ఉపదేశమును ఆశింపవచ్చునా? ఇట్టి ప్రశ్నలకు ప్రాచ్యపాశ్చాత్య విమర్శకులు భిన్న భిన్నముగ ప్రత్యుత్తరము లిచ్చియున్నారు. అయినను నాటకమును సాంఘికోద్దరణము కొఱకు ఉపయోగింప వచ్చునని తీర్మానించిన విమర్శకుల సంఖ్యయే హెచ్చు. నాటకములయందు ఉపదేశముండవచ్చును కాని, ఆ యుపదేశము రసాత్మకమయి, ప్రత్యేకముగ ఒక యుపదేశమని యనిపించుకొనక , అలక్ష్యముగ సామాజికుల హృదయములోనికి ప్రవేసింపవలయును. ఇట్లు నిర్మించుట కళానైపుణ్యము. కవి వాక్కును హ్లాదైక మయమని వర్ణించుచు ప్రయోజనములను లెక్కించునపుడు " కాంతాసమ్మితతయోపదేశ యుజే” అని మమ్మటుఁడు చెప్పెను. దీనినే పాశ్చాత్య విమర్శకులు