పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

కవికోకిల గ్రంథావళి


"Delightful instruction” అని నుడివియున్నారు. “ఆనందమున ఉపదేశమును మెదిపి మానవసంఘోద్దరణమునకు కావ్యము తోడ్పడవలయు” నని హొరేస్ కవి చెప్పెను. విక్టరు హ్యూగో, ఇబ్‌సన్ మొదలు బెర్నార్డుషా వఱకుఁ గల పాశ్చాత్య నాటక రచయితలు నాటకమును మానవ సంఘశ్రేయమునకుగా వినియోగించిరి.

"Art for art's sake”. అనగా, కళ ప్రయోజన నిరపేక్షకముగ నుండవలయునను వాదమొకటి కలదు. ఇది మన దేశమునకు క్రొత్త. కావ్యము ఆనందమాత్ర ప్రయోజనమయ్యును, విశ్వశ్రేయమును చేకూర్చునదిగ కూడ నుండవలయును అని మన లాక్షణికుల మతము. విశ్వశ్రేయ మను మాటయందు సాంఘిక ప్రయోజనత్వము ధ్వనించుచున్నది. ప్రయోజన నిరపేక్షక వాదుల సిద్ధాంత ప్రకారము కవి నిర్బాధ్యుఁడు. తన యానందమును పట్టలేక పాడుకొనుచుండును. సంఘమునందు తన రచనల మూలమున కలుగు అనుకూల ప్రతికూల ప్రవర్తనములతో కవి కేలాటి సంబంధము లేదు. గోకిల ఏమి ప్రయోజనము నాశించి గానము చేయుచున్నది? నెలయేరు ఎవరిని సంతృప్తిపఱచుటకు బిలబిల ధ్వనులతో ప్రవహించుచున్నది? అని వీరు ప్రశ్నించెదరు.

చింతా దీక్షితులుగారు ఈకోయిల, సెలయేటివాదములను ఇమిడ్చి సొగసుగా వ్రాసిన గేయములను నేనెప్పుడో చదివినట్లు జ్ఞప్తియున్నది. ఇట్టి ప్రశ్నలడుగువారు కోయిలకు, సెలయేటికి ప్రయోజనము నాశించు జ్ఞానమున్నదా? లేదా? యని విచారించినట్లు కనఁబడదు. కోకిలపాట మనకు