పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/140

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

134

కవికోకిల గ్రంథావళి


కసిదీర్చుకొను నిచ్చయు వరూధిని మనమునందుఁ జెలరేఁగి ముప్పిరిగొన్నవి; దుఃఖము పొంగిపొరలి వచ్చినది.

"పాటున కింతులోర్తురె? కృపారహితాత్మక, నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొను.....”

తన యమ్ముల పొదిలోని మన్మధాస్త్రములన్నియు వ్యయమైనవి. తుట్టతుదకీ యస్త్రమొక్కటి నిలిచి యుండినది. ఇది యమోఘము కావచ్చును. అయ్యో! దేవుఁడా, యీ యస్త్రముకూడ ఆఱాతిపైఁ దగిలి మొక్క వోయినది.


నాటకము : చరిత్రము

నెలదినములకు పూర్వము [1] కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారు కళాప్రపూర్ణ వేదము వేంకటరాయశాస్త్రిగారి “ప్రతాపరుద్రీయము"లోని కథ చారిత్రకము కాదని ఒక విమర్శనము గేయముగవ్రాసి “ప్రజామిత్ర"లో, బ్రకటించిరి. ఆ విమర్శనము ప్రతాపరుద్రీయ నాటకమును గుఱించి వ్రాయఁబడినప్పటికిని, అందలి విషయము నాటక రచయితల కందఱకు సంబంధించి యున్నది. కావున ప్రస్తుతము చర్చనీయముగా ఏర్పడినది.

వాఙ్మయ వివాదములలోఁ ప్రవేశించుట నాప్రకృతికి విజాతీయమైన పని. అందులో ఇప్పుడు నాకు ఓపిక గాని,


  1. 1935 మేనెల 5 తేదికి ముందు నెలనాఁడు.