పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

95


విషయమైగూడ నేనిట్లే మనవిచేసికొనుచున్నాను. కావున నేను నిర్మలహృదయముతోడను శిల్పదృష్టితోడను రచియించిన యీ వ్యాసమును నాటక కళాభిమానులెల్లరును అన్యధా తలంపక నా సదుద్దేశమును గ్రహింతురని ప్రార్థనము.

నాటక కవి

ఇప్పుడు వెలువడుచున్న నాటకములలో 100 కి 90 నాటకములు 'నాటక 'మని పేర్కొనుటకుఁ దగినవి 'కావు. ఒకకధలోని కొన్నిసీనులను ఒకటిగా జోడించినంతనె అది యొకనాటక మగునని కొందఱు నాటకరచియితల యుద్దేశ మైయుండును. నాటకమునకు ఆదిమధ్యాంతములు కలవనియు, సంధిబంధమును, సంయోగతయు సడలినయెడల నాటక శరీరము విచ్చిన్నావయవ సమూహమువలె నుండుననియు వీరెఱుఁగరు. ఒకవేళ నెఱింగియు ఆచరణమున నసమర్థులై యున్నారు. ఇప్పటి కొన్ని నాటకములలో మేకపోతుమెడ చన్నులు, ఆఱవవ్రేలు' మున్నగు రచనా విశేషము లగపడుచున్నవి. ప్రజలకన్నులలోఁ దేలికగా దుమ్ముకొట్టుట కలవాటుపడి రంగ సంప్రదాయములను చక్కగాఁ దెనిసినకవులు అట్టి రచనావిశేషముల నాశ్రయింతురు. వానితో నాటకసమష్టికి నవసరమైన సంబంధ మేమియుండదు. నిరుపయోగములును, విపరీతములును నైస అట్టియవయవములను గత్తిరించినను లోప మేర్పడదు. ఇది రచనాన్యూన తయైనను, లేక పేక్షకులను సులభముగ వలలో వేసికొనుటకు కవి ప్రయత్నపూర్వకముగ నొనరించిన