పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

94

కవికోకిల గ్రంథావళి


భాషకు గౌరవము కలుగుచున్నది గాని, భాషవలన నింద్య భావమునకుఁ గూడఁ బ్రశక్తి కలుగదు.

నేను సుమతి నాటక ప్రదర్శనమును చూచినప్పటి నుండియు, నాటక రచయితలయందును, నటకులయెడను, ప్రేక్షకులయందును నా కొకవిధమైన శ్రద్ధపుట్టినది. అప్పటి నుండియుఁ గొందఱి యాధునిక కవుల నాటకములను జనరంజుకములని ప్రజలచేఁ దలంపఁబడు మఱికొన్ని నాటకములను సుప్రసిద్ధులని తలంపఁబడు నటకులచే పదర్శింపబడుచుండినపుడు చూచుచుంటిని. జనరంజకత్వమునకుఁ గారణములను, . అంద కై కవులును నటకులును జేయుచున్న వ్యాపారరహస్యములను, మోసములనుగూడ గ్రహించి నా యభిప్రాయములను ఈ వ్యాసమూలమునఁ బ్రకటింపఁ దలంచితిని. ఇట్లు చేయుటవలన, నే నెందఱెందఱి యనుమానములకు, విమర్శనములకుఁ బాత్రుఁడను కానున్నానో నే నెఱుంగుదును. ఈ వ్యాసమునందు నే ఇచ్చట నైనను నిదర్శనపూర్వకముగ నాయభిప్రాయమును వెలిపుచ్చవలసివచ్చినప్పుడు, ఎవరినై న నాటక రచయితలను నటకులను సమాజములను విమర్శించి దృష్టాంతములుగఁ గైకొనుట నాకు. వారిపైగల ద్వేషముచేఁ గాదు. కాని, శిల్పముఁపై గల గౌరవముచేత, నేను కొన్ని నాటకములలో అనౌచిత్యములకు నుదాహరణములను గైకొంటినిగావున, ఆ నాటకములెల్ల అనౌచిత్య భూయిష్టములనియు, ఆయానాటక రచయితలు కల్పనా నిపుణులు కారనియుఁ బాఠకమహాశయులు తలంపరాదు. ఆ గ్రంథములపై నను ఆ కవులపైనను నా కత్యంతగౌరవము కలదు. నటకుల