పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

కవికోకిల గ్రంథావళి


వంచనమైనను గావలయును. ఒక ఉదాహరణము: రామదాసు నాటకములో 'అహమక్కు సీను' లవకుశలో 'చాకలివానియింటిసీను' వానిని వేఱుపఱచి, అట్టిసీనులు ప్రత్యేకముగఁ బ్రదర్శింపఁ బడినపుడు హాస్యరసోత్పాదకములయి వినోదము కలిగిలింప వచ్చును. కాని ఆనాటకము లందు ఆయకథాభాగమున వాని కంత ప్రాముఖ్యము లేదు. మొగమునకు ముక్కు అందమని యొకశిల్పి మూరెడు ముక్కునుజేసి యొక మానవ విగ్రహమున కంటించి నట్లున్నది, నాటక శరీరమందు అంగాను గుణ్యము చాల ముఖ్యము. కేవలము, లోభముచేత అనుచిత మైన కల్పనలకుఁ బూనుకొనుట నింద్యము.

ధర్మవరము రామకృష్ణాచార్యులవారి నాటకరచనతోడఁ గ్రొత్తనాటకలక్షణము లేర్పడినవి. సంక్షేపముగభావమునుఁ బ్రకటించుటయన్న ఆకవి యెఱుంగని పరమరహస్యము. రెండుమూఁడు మాటలలోఁ జెప్పఁదగిన భావమును అచ్చులో నరపేజికిఁ దక్కువగాఁ జెప్పఁడు. దుఃఖము! యొక్క పరిమాణము వాక్యముల దీర్ఘత్వము ననుసరించియు సంఖ్య ననుసరించియు నుండునని తలంచికాఁబోలు బాహుకునికిఁ గొండవీటి చేంత్రాడువంటి స్వగతమును గల్పించి ప్రేక్షకులపై ఆయనకుఁగల కసియంతయుఁ దీర్చుకొన్నాఁడు. వ్రాసిపెట్టిన పద్యములు గ్రంథస్థములు కాకపోయినయెడల విస్తృతములగు నను తలంపుతో బాహుకుఁడు చంద్రుని దూషించు కథా భాగమున నిక్షేపించినాఁడు. వీనినన్నిటిని తలదన్ను చాపల్యము మఱియొకటి గలదు. ప్రహ్లాదనాటకమున లీలావతి పాడునట్టి “రారా ధీలోలా-నా బాల' అను