పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/201

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అనార్కాలి.

అతిలోకసుందరీ, యవనకుమారి,
ఓ మోహమాధురీ, ఓ యనార్కాలి,
ఏలొకో యీవేళ నిహలోక రంభ
వేషంబు ధరియించి వీక్షణంబులకు
నవ్యక్త మధుర దివ్యానంద లాభ
మొనగూర్చెదవు నర్తనోన్మత్త గతుల?
అగ్బరు పాదుషా హర్మ్య మంటపము
అప్సరః పాద యావంక పల్లవిత
సురనాధ సభపోల్కి , వఱలె నీకతన,
అనుభూత పూర్వంబులౌ కోర్కెలెల్ల 10
మరల మోసెత్తె మధుమాస నిశల!
విరఁబూయు రోజాల వింతనెత్తావి
నాసవ పరిమళ మైక్యంబు నొంది
సంయమి మతినైన సడలించు నిపుడు;
అర్ధ నగ్నాంగియౌ యచ్చరవోలె
నయన నిర్వృతిఁ గూర్ప నటియించె దౌర!