176
కవికోకిల గ్రంథావళి
[నైవే
అనిమిషత్వము నొంది యాయద్భుతంబు
నరయుచుండెను శాస్త్రి నోరంత దెఱచి;
యంతఁ గౌఁగిలి వీడి యీ యబనేత్ర
పిన్ననవ్వులు మోమునఁ జిన్నెలొలుక :
'చాలిఁక! శాస్త్రిగారు, శ్రమ చాల వహించిమదర్థమయ్యయో
కాలుకుఁ గాలు గొట్టుకొనఁ గాననసీమకు వచ్చి, యింత కే
మేలునుబొందకే తిరిగి మాపురిఁ జేరుటఁ జూడ నాకునున్
జాలిజనించె; దైవముప్రసన్నముగా, దిఁకఁ బొండు' నావుడున్;
ఈర్ష్య యొకవంకఁ, బరిభవ మింకనొక్క
కడను, జిత్తమ్ముఁ జుఱచుఱఁ గాల్చుచుండఁ
గటము లదరఁగఁ గనుబొమల్ నటనసేయఁ
బండితుఁడు పళ్ళు బిగఁబట్టి ప్రతినచేసె:
'నేనేతిమ్మయశాస్త్రిపుత్రుఁ డయినన్ నిత్యమ్ముఁ గాత్యాయనీ
ధ్యానారూఢహృదబ్జతన్ విధుల సద్ధర్మంబులం బ్రత్యుష
స్స్నానంబుం బొనరింతు నేనిఁ గవితా, సత్యంబుగా నీ జిగుల్
నీనాణెంబు నోయారి యంచనడలున్ నిర్మూలముం జేసెదన్.'
అని కోపంబున మూటముల్లె గొని సంధ్యావందనాపేక్షచే
వనమార్గంబునుబట్టి యేటిదరికిన్ బాండిత్యవాహుండు పో
యిన, నా యిద్ధఱు నెచ్చెలుల్ వనవిహారేచ్ఛన్ నదీసైకతం
బునకుంబోయిరి జంటఁబాయకమనంబుల్ దేహముల్ వర్తిలన్