పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

పండితప్రతిజ్ఞ

175

పొదరిండ్లలోఁ దూఱి పొదలయల్లికఁ జూచు,
            నడవిజింకల తోడ నాటలాడు,
సాంధ్యారుణాంకిత జలద ఖండముఁ గాంచు,
            వనరామణీయకమును దలంచు,

మధుర రసము తనదు మనమునఁ దొలఁకాడ
లోకమెల్లఁ దేనెపాక మనును;
నిట్టి మృదులహృదయుఁ డెచ్చోటనుండియో
పిచ్చివానిపోల్కీ వచ్చుచుండె.

అతనిఁ జూచి కాంత, తన యంతు నెఱింగినచెల్మికాఁడు, సాం
ధ్యాతపకాంతులం బ్రకృతియందముఁగాంచఁగ నేఁగుదెంచెఁ;దా
నా తరుణుం డొకళ్లొకరి యంసమునం జెయివైచి ముగ్ధసం
గీతములన్ రసంబు లొలికింపఁ దలంపులు దీవరింపఁగన్;

వచ్చి రాక మున్నె వరునిఁ గౌఁగిటఁ జేర్చె
మూఁతవడ్డ కనుల ముత్తెసరుల
గతినిఁ బ్రమదబాష్పకణములు చిప్పిల్ల
నొడలఁ బుల్క.నారు లుప్పతిల్ల.

రెండుకీలలు నేకమౌరీతి నిరుపు
రొక రొకరి కౌఁగిళులోన నుండి రపుడు;
వసుధఁ బ్రతిదియుఁ బ్రణయ పిపాసతోడ
నొకటినొకటి నాశ్లేషించు నొప్పు దోఁచె! '