పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

174

కవికోకిల గ్రంథావళి

[నైవే


'ప్రేముడితోడ నాయురము బిట్టుగ నీ 'కవుఁగింటఁ జేర్పకే
యోమనుధర్మశాస్త్రరత, యూరకపోయేదె' యంచుఁ దెచ్చికో
ల్దీమస మూని కౌఁగిలిడఁ దేరకుఁ దత్తఱమంది చూచు చే
మేమొ వచించుచుం గనుల నెత్తక చేతుల నూడఁబీఁకినన్ .

ముద్దుమాటలు వల్క మోము చిట్లించుచు
          శబ్దసంస్కారంబు చాలదనును;
అడవిపూఁదొడవులఁ దొడిగియుండుటఁ గాంచి
          యీ యలంకృతి లోప మెసఁగె ననును;
మురిపంబు దళుకొత్త మోవి యనఁగఁ బోవ
          నెంగిలి రస మంచు నీసడించు;
బలిమిమై గిలిగింప నులికి బారెఁడుదాఁటి
          జిలిబిలి నడలెల్లఁ జెల్లవనును;

పెట్టరానట్టి సిలుగులఁ బెట్టి చెలువ
యాటపట్టించి చెర్లాట మాడుచుండఁ,
గాననంబున నేడనో కానరాక
మురళిరావంబు వినవచ్చె మోహనముగ.

పూలగుత్తులఁ గాంచి పునికి ముద్దాడును,
            పికమనోహరగీతి విన్న మెచ్చు,
సెలయేళ్ళపాటలఁ జెవియొగ్గి యాలించు,
            రాలుఁబువ్వుల నేరి మాల గ్రుచ్చు,