పుట:Kavijeevithamulu.pdf/726

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
718
కవి జీవితములు.

ఇట్లుగాఁ దాను వ్రాసినగ్రంథము నొక రెవరో బాగున్నదన సంతసించునంతటి బుద్ధిశాలి యీగ్రంథమువంటి శాస్త్రముం దెనిఁగింపఁ గడగుట విశేషగౌరవాహము గా దని నే నూహించెదను. పాఠకులే ఆగ్రంథములోని మంచిచెడ్డ లరయవలసిన వారుగావున నిపుడు మనము విస్తరించవలసినది లేదు. మనము ప్రారంభములో సింగనకవిచారిత్ర మారంభించి అతని కథతో దాని ముగించుట న్యాయము కావున నాతని యాశ్వాసాంత గద్యము నిట వివరింతము :_

"ఇది శ్రీనరసింహవరప్రసాదలబ్ధ కవితావిలాసభారద్వాజగోత్రపవిత్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతం బైనజ్ఞానవాసిష్ఠ రామాయణమునందు సర్వంబును బంచమాశ్వాసము."

పురాణకవులవివరము.

దీనిం దెల్పుటకుఁ బూర్వము పురాణములనామవివరమును, అట్టి పురాణములలో నెన్ని తెలిఁగింపబడినదియు, నట్లుగాఁ దెనిగించిన వారినామములును తెలిసినవఱకు వివరింపఁబడవలసియున్నది. కావున ముందుగఁ బురాణనామముల వివరించెదను. ఎట్లన్నను :_

నెం. 18 పురాణములు. తెనిఁగించినవారిపేళ్లు.
1. ఆదిత్యపురాణము తెలియదు.
2. కూర్మపురాణము 1. మండ చిట్టికామశాస్త్రి. 2. రామలింగకవి.
3. గరుడపురాణము పింగళిసూరకవి.
4. నారదీయపురాణము తెలియదు.
5. పద్మపురాణము పద్మపురాణమునకే కథాసంగ్రహము శ్రీనాథకవితాత యగుకమలనాభకవియు దీని యుత్తరఖండము రామగిరి సింగనకవియు తెనుఁగున నొనర్చిరి.
6. బ్రహ్మకైవర్తము తెలియదు.
7. బ్రహ్మాండపురాణము తెలియదు.
8. బ్రాహ్మము తెలియదు.
9. భవిష్యోత్తరపురాణము తెలియదు.