పుట:Kavijeevithamulu.pdf/727

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామగిరి సింగనకవి.

719

10. భాగవతము బమ్మెరపోతనామాత్యుఁడు. ఇది దేవీభాగవత మని కొందఱమతము. త్రపురానతమ్మనదొర దానిం దెనిఁగించెను.
11. మత్స్యపురాణము తెలియదు.
12. మార్కండేయపురాణము మారనకవి, మండ కామశాస్త్రి.
13. వరాహపురాణము 1. మల్లయమలయమారుతకవులు. 2. చంద్రహరిభట్టు.
14. వామనపురాణము తెలియదు.
15. వైష్ణవ మనఁగా విష్ణుపురాణము వెన్నెలకంటి సూరకవి.
16. శైవపురాణము తెలియదు.
17. లింగపురాణము తెలియదు.
18. స్కందపురాణము దీనిలోని కాశీఖండ, భీమఖండముల, శ్రీనాథకవి తెనిఁగించె. కోడూరి వేంకటాచలకవి శివరహస్యఖండముఁ దెనిఙగించె. హాలాస్య మాహాత్మ్యము తిరుమలసెట్టి జగన్నాథదాస కృతము.

పై పురాణముల కెదురుగా వ్రాయంబడిన పేరులు గలవిమాత్ర మాంధ్రభాషలలోనికిఁ దేఁబడినవి. తక్కినవి మనకు లభించనివగుట చేత వానివృత్తాంతము వివరింపలేదు. పైవారిలోఁ జారిత్రము గలవఱకు నీకవిజీవితములలోఁ జూపట్టుదురు. మిగిలినవారివిశేషములు కవికావ్య ప్రశంసాచంద్రికలోఁ జూడఁదగును.

కవిజీవితములు

సమాప్తము