పుట:Kavijeevithamulu.pdf/725

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
717
రామగిరి సింగనకవి.

తా నీగ్రంథము ముగించిన కాలమును దీనినిఁ బరిశీలించిన పండితుని విశేషంబులు వివరించె. అది యెట్లున్నదనఁగా :_

వార్ధికషట్పది.

"ఒనరు నీకలియుగంబున నాల్గువేలహా, యనములకుఁ బైఁ దొమ్మనూటడెబ్బది
 యొకటి జనిననంత వచ్చిన ప్రమోదూతవత్సరపు నాశ్వయుజశుద్ధమందూ, అను
 గతకుజాఖ్యవాసరమగుఁదృతీయనాఁ డినుఁడు జనియించినంతట నైదుగడియలకు
 తనరె సంపూర్ణమై యీగ్రంథసత్తమము మత్పుణ్యపటిమచేతన్."

అనఁగాఁ గలియుగములో 4971 సంవత్సరములు కాఁగా వచ్చిన ప్రమోదూతవత్సర ఆశ్వయుజ శుద్ధతదియ మంగళవార మని తేలినది. ఇది చెన్నపట్టణములో ఆ 1873 వ సంవత్సరమునకు సరియగు శ్రీముఖ సంవత్సరములో ముద్రించి ప్రకటింపఁబడినది. అనఁగా క్రీ. 1870 సంవత్సరమునకు సిద్ధమై మఱినాల్గుసంవత్సరములలోపుగానే ముద్రింపఁబడినది.

గ్రంథపరిశీలకవిషయము.

"ఉ. ఆమొదటిప్రసిద్ధకవియాస్యవినిర్గతమైనసూక్తులం
      దేమివిశేషముల్గలవొ యేమియునేరనిమూఢుఁడైననే
      నేమిటిసంగ్రహించితినొ యేమిటినిం ద్యజియించినాఁడనో
      యేమిమహాపరాధముదయించెడినో యనిసంశయాత్ముఁడై.

సీ. తతసాధుతరసంపదావసధంబయి, పరుగుచుండెడి ధర్మపురియనేటి
    పురమునం గలవిప్రపుంగవు ధర్మజ్ఞు, కావ్యార్థబోథన కౌశలాఢ్యు
    మౌద్గల్యగోత్రుసన్మానితనుచరిత్రు, ధీమంతుశాంతునధీతనిగము
    సర్వశాస్త్రార్థజ్ఞు సత్యవ్రతాచారు, జానకీధవపదాబ్జాప్తచిత్తు

తే. గీ. కరతలామలకీకృతపరసుతత్త్వు, పరమమంగళసద్గుణభరితు నమలు
        సత్యసంపన్ను సుందరశాస్త్ర్యభిఖ్యుఁ, బిలిచిమన్ననమెయివిన్నవించినంత.

ఉ. ఆమహనీయమూర్తియు మహామునిజల్పితమైనకావ్యము
    న్మాహకకావ్యముంజదివిమానకచర్చయుఁజేసియాంధ్రమం
    దేమియునర్థభేదముదయింపఁగ లే దిదిసాధువన్న నిం
    కేమి ధరిత్రి నేనెకృతకృత్యుఁడ నంచు ముదంబుఁ జెందితిన్."