పుట:Kavijeevithamulu.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

716

కవి జీవితములు.

క. బాలుం డల్పోపకృతిం, జాలను సుఖమందుమఱియుసాల్పాకృతికిన్
    జాలింబడుమలమునఁగడు, మేలనిరమియించుసారమేయముభంగిన్.

చ. అవనినదెట్టిమౌర్ఖ్యముననన్యులదయ్యు భుజింపరానిద
    య్యు వెలయువస్తుసంతతిని యోడకతాభుజయింపఁగోరునిం
    దువునువియత్ప్రదేశముననుండి గ్రహింపఁగఁగోరునట్టిమౌ
    ర్ఖ్యవిలసితంబుబాల్యముసుఖంబునకెట్లగుఁదాపసోత్తమా.

క. అలశిశుతం దలితండ్రుల, వలనన్ గురుపరజనములవలనం బ్రవయ
    స్కులవలన భయము గల్గుట, వలనన్ శైశవము మిగుల భయమందిర మౌ."

ఇట్లుగా నున్న పద్యసప్తకమును సింగకవి యొకసీసపద్యములో నొకకందపద్యములోనం జెప్పె. ఎట్లన్నను :_

"సీ. ఆశాసమావృత మతిశక్తిహానంబు, జాడ్యంబు దైన్యంబు చపలతయును
      మాటాడనేరమి మాటపొందెఱుఁగమి, యిది పాము త్రాఁడని యెఱుకలేమి
      మూత్రపురీషసంప్లుత గాత్రుఁడైయుంట, తన్నుఁదా నెఱుఁగక తన్ను కొనుట
      కదలి యిట్టట్టుపోఁగాళ్లురాకుండుట, గురుజనశిక్షలఁ గుటిలపడుట

ఆ. యివియుమొదలుగాఁగ నెన్నఁ బెక్కగునట్టి, బాధ లనుభవించుబాల్యవృత్తి
    పరమమునివరేణ్య ప్రత్యక్షనరకంబు, దీన నేమిసుఖము తెలుపవయ్య.

క. తల్లియుఁ దండ్రియు నితరులు, ప్రల్లదు లై తోడ నాడుపడుచులు నడువన్
    తల్లడపడు శైశవ మిది, చెల్లంబో దురితదుఃఖశీలమ కాదే."

ఇట్లే గ్రంథమంతయు నున్న దని సూచించుట కీపద్యములే చాలును. సింగనకవి మాతృకాభిప్రాయానుసారముగాఁ దెనిఁగించుటచేత నాతనిగ్రంథముఁ జదువుచున్నపు డదియును మాతృకాగ్రంథమువలెనే యనన్వయాదులు లేక ధారాశుద్ధి గలదిగాఁ గాన్పించు. ఇఁక వేంకటరమణ కవికృతగ్రంథము నైసర్గికధార లేనిదై యనన్వయవాక్యపూరిత మైమాతృకం జూచినఁగాని కవియభిప్రాయము స్పష్టముగానిదై యుండి కొన్నిస్థలములలో నాంధ్రభాష యిది కాదేమో యనుసంశయము కల్గించుచుండును. ఈరెండుగ్రంథములకుం గలభేదమును స్థాలీపులా కన్యాయంబునఁ జూపినాఁడను గావున నిఁక వేంకటరమణకృతగ్రంథ మెట్లు పరిసమాప్తి నందింపఁబడినదో దానిం జూచెదము. అందులో నీకవి