పుట:Kavijeevithamulu.pdf/723

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామగిరి సింగనకవి.

715

సిం. "క. అతులతపస్స్వాధ్యాయ, వ్రతశీలుఁడు బోధనిధి భరద్వాజుఁడు వి
           శ్రుతకీర్తియొక్కనాఁ డే,కతమున వాల్మీకిమౌనిఁ గని సంప్రీతిన్."

వేం. "తే. సాధు వత్స భరద్వాజ సద్గుణాఢ్య, యోగ్యుఁడవు నీవు చెప్పెద నున్న తమగు
           డేని వినినంతలోన నజ్ఞానమలము, దూరమొనరింపఁగల దట్టిదొడ్డదాని."

సిం. "క. విను వత్స లెస్స యడిగితి, వినయోగ్యుఁడ వీవు వీని విస్పష్టముగా
           ఘనమోహతమము దూరం, బునఁ దొలఁగఁగఁ ద్రోచుమార్గమును వినుపింతున్."

వేం. "చ. అమలినచారుతేజ వినుమయ్య వియత్తలమందుఁ దోఁచుగా
           ళిమగఁడు మిథ్యయై ధర వెలింగియుఁ దథ్యము గాగఁ దోఁచు నా
           క్రమముగ మాయచేతఁ బరికల్పిత మై యిటుదోఁచెడిం జగ
           ద్భ్రమను మదిన్ స్మరింప నటు పాయుట మే లని నే తలంచెదన్.

       క. కణఁగి క్షణక్షణమున నీ, క్షణపదమును బొందుమేటి సర్వజగతి సె
           ట్లణఁగించు టనియె దేనిసు,గుణగణపరిపూర్ణ వినుము కోరిక వెలయన్."

సిం. "గీ. కానఁబడులేకవిరియునాకాశవర్ణ, భాతినీజాగ్రతభ్రాంతిభ్రమలఁబెట్టు
           నదియు పలుమాఱు దలఁచిన నంతకంటె, నట్టితలఁపులు దలఁచనియదియ లెస్స.

       గీ. కానఁబడ్డవిమిథ్యలు గాఁగ దెలియు, జ్ఞానమునఁ జేసి దృశ్యమార్జనముసేయఁ
           జిత్తగేహంబువిమలమైచెలఁగినిత్య, మైననిర్వాణపదవృత్తియందు నొందు."

వేం. "గీ. బద్ధుఁ డేను ముక్తిఁ బడసెద నిఁక నను, నిశ్చయంబు ధరణి నెవ్వని కగు
           నాతఁ డీసుశాస్త్రమం దధికారియౌ, ననధికారు లజ్ఞు లాత్మనిదులు."

సిం. "గీ. అకట భవపాశబద్ధుఁడ నైననాకు, వెడలుబా టెద్దియో యని వెఱచుచున్న
           యార్తుఁడధికారియగుఁ గానియజ్ఞుఁడైన, తజ్జ్ఞుఁడైననుయీశాస్త్రతముఁడుగాఁడు."

బాల్యకాలదుఃఖవర్ణనము.

వేం. "వ. బాల్యస్వరూపంబు వివరింపఁగలవాఁ డై శ్రీరాముం డిట్లనియె.

గీ. అస్థిరాకృతిఁ గబ్గి చేయంగవలయు, కార్యగతులను బహుతరంగములుగల్గి
    జగతిఁ బురిగొన్నసంసారసాగరమున, బాల్యజన్మముదుఃఖముల్వడయఁ గాదె.

గీ. మూఢతయు నాపదయుఁదృష్ట మూకతయును, జపలతయశ క్తిక్షుత్పిపాసలమదీన
    భావ మివి మొదలగు దుఃఖవర్ధకములు, సర్వమున్ బాల్యమునఁ బ్రతిష్ఠనువహించు.

క. మానసపుంబ్రకృతియెచల, మాననిబాల్యంబుదలఁపనతిచంచలమౌ
    పూనికరెండుంగూడిన, దానిందేనికిసమమనితలఁపఁగ వచ్చున్.

క. ఉవిదయుకన్నులమెఱపులు, దవదహనజ్వాల లలలతండంబులు శై
    శవసంగతచిత్తముచే, నవనింగఱచినవిప్రబలమగుఁజంచలతన్.