పుట:Kavijeevithamulu.pdf/722

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

714

కవి జీవితములు.

ముమ్మాఱు చెప్పుచు సారాంశము తేలియుండునట్లుగాఁ జెప్పక ఛాందన వృత్తితో నుండునట్లుగాఁ జెప్పుటఁగన్పట్టి తొంటిపురాణాంధ్రకవులందఱు నామార్గము నవలంబించక సారాంశమునే ప్రధానము చేసుకొని సంగ్రహరూపముగానే ఆంధ్రములో నాగ్రంథములు ప్రకటించిరి. అట్లుగా సారాంశప్రకటనముఁజేయుట కష్టసాధ్యముగావున నట్టిపనిం జేయక ప్రస్తుతకాలములోనివారు యథామాతృకముగాఁ దెనిఁగించుచున్నార మని చెప్పుచు శ్లోకమునకుఁ బద్యము వ్రాయుచుఁ జర్వితచర్వణముం జేయుచున్నారు. వీరికి లోకోపకారమే ప్రధాన మైనయుద్దేశ మైనయెడల సంస్కృతములో ఛందోబద్ధములుగా నుండుగ్రంథములను దేశభాషలలోనికిఁ గేవలము వచనరూపగ్రంథములుగా రచియించినదానివలనఁ గొంత లాభము కల్గును. అటుగాక తొంటిగ్రంథములనే తిరుగ నారంభించుచు నాగ్రంథము నాంధ్రీకరించిన పూర్వపువారికిఁ దమకుఁ గలకవిత్వభేదమరయఁబడునేమో అనుభయముతో యథామూలముగా మేము తెనిఁగించినారము. పూర్వు లిట్లుగాఁ దెలిఁగింపకుండుట యొకకొఱఁత యని యేల సూచింపవలయును? ఈగ్రంథకర్తవలెనే వాల్మీకికృత రామాయణము యథామూలముగాఁ దెనిఁగించితి నని యింకొకరు తెనిఁగించి దానింగూడఁ బ్రకటించిరి. కాని భాస్కరరామాయణము నా నవీనరామాయణమును రెంటిని బురాణముగా వినువారివలన వానిమంచిచెడ్డలు తెలియఁ బడును. అప్పుడుగదా ప్రాచీనులమార్గమునకు నవీనులమార్గమునకును గలభేదంబు గోచరంబగు. అటులనే ప్రస్తుతవాసిష్టరామాయణము నుండెననుటకు సందియంబు లేదు. వలయునేని యేకథాభాగములోఁ జూచిన నాకథలోనే యీభేదము తేలక మానదు. దాని నాగ్రంథారంభములోనే కొన్నిపట్లలోఁ జూపెదము.

కథారంభములో

వేం. ర. "అ. గురుని నేకతనమునఁ గూర్చున్న వాల్మీకి నఖిలదర్శనములు నపుడుగాంచి
               ప్రణుతి సల్పి యాభరద్వాజుఁ డిటు మృదు, స్వరము గరము వెలయ సరగ నడిగె."