పుట:Kavijeevithamulu.pdf/677

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

671

నీవిష్ణుపురాణము రచియింపఁబడినకాల మటుతరువాత నఱువది డెబ్బది సంవత్సరము లైన నై యుండవచ్చును." అని యున్నవి. ఇందులోఁ బంతులవా రొకసంగతి నాలోచింపనట్లుగాఁ గాన్పించు. ఆకారణంబున వీరభద్రరెడ్డి పై రాఘవరెడ్డికిఁ బూర్వులలో నొకఁ డని పంతులవారు నిర్ధారణ చేసిరి. అది పొరపాటుగా పైని నావలనఁ బ్రస్తరింపఁబడిన రాఘవరెడ్డి వంశావళివలన స్పష్టమే. దానిలోని రాఘవరెడ్డి తండ్రి బసవ రెడ్డి అయినట్లు, నాతనితండ్రి తమ్మారెడ్డి అయినట్లు నాతని తండ్రి పేరమరెడ్డియు, నాతనితండ్రి లింగ భూపాలుఁ డైనట్లు కానుపించు. పై వీరభద్రరెడ్డి, రాఘవరెడ్డి పూర్వులలో నొక్కఁడు కావలసియుండునెడల నైదుగురు పురుషులకుఁబైవాఁడు కావలయును. అటులైన నాయిర్వురకుం గలకాలభేద మఱువది డెబ్బది సంవత్సరములుగాక నూటనలుబది నూటయేఁబది సంవత్సరములవఱకు నుండవలసివచ్చును. ఇఁకఁ దొంటిరెడ్డిరాజు లనుదాని కెట్టి యర్థము చెప్పవలయు నని శంకించుకొనియెదము. పైవీరభద్రరెడ్డివఱకును రెడ్లు మిగులఁ బ్రబలు లైనదేశాధిపులై యుండిరి. మొట్టమొదట నీరెడ్లకుఁ గొండవీటి సీమ, అద్దంకి, అమ్మనబ్రోలు సీమలు ముఖ్యస్థానము లై యుండిన నట్టివానిలో వీరి అధికారము క్రమముగా క్షీణించి తుదకు రాజమహేంద్రవరము మొదలు తూర్పున నున్న లక్షకలింగమునకు మాత్రమే ప్రభుత్వము నిల్చినది. అదియును శ్రీనాథుఁడు భీమఖండంబున వివరించిన విధంబునఁ బూర్వసామ్రాజ్య పీఠస్థు లగుప్రోలయవేమ అన్నవోత, అన్నవేమ, కుమార గిరీశ్వారాదుల సంబంధ బాంధవ్యంబున వసుంధరాభారధౌరంధర్యంబు అల్లయవేమ వీరభద్ర రెడ్లకు సంప్రాప్తంబయ్యె. పైరాఘవరెడ్డి తనకులస్థులలో దేశాధిపతు లని విఖ్యాతివహించి యున్న అళ్లయవేమ, వీరభద్రాదులగు రెడ్డిరాజులు కృతు లంది విశేషకీర్తి సంపాదించిరి కావునఁ దాను నట్టి పనినే చేసి శాశ్వత కీర్తినందె నని తాఁ జేయుచున్న కార్యోత్కృష్టతఁ దెల్పుటకుఁ పల్కె.