పుట:Kavijeevithamulu.pdf/676

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
670
కవి జీవితములు.

త్తాంతవిశేషములు నావలన దీనికి వెనుకటిభాగములోఁ గృష్ణదేవరాయ చరిత్రములో స్పష్టపఱుపఁబడినది. కావున నిపుడు కృష్ణదేవరాయల తండ్రితాతలకాలములోఁ గొండవీడు కృష్ణరాయవంశస్థులస్వాధీనములో నుండెనని చెప్పవీలులేదు. ఇఁక పైకర్ణాటమండలేశ్వరుఁ డెవ రని శంకింప వలసియున్నది. బుక్క రాజుయొక్కవంశమువారు శా. స. 1250 మొదలు 1400 సంవత్సరములవఱకుఁ గర్ణాటకప్రభుత్వము చేసిరి అట్టివారిలోఁ బైవిరూపాక్షరాజు నతనియనంతర మతిప్రసిద్ధుఁ డగుప్రౌఢ దేవరాయలును క్రీ. శ. 1476 అనఁగా శా. స. 1400 వఱకును రాజ్యము చేసినట్లు (" Lists of Antiquities of Madras, " Vol II. page 128) గ్రంథదృష్టాంత మున్నది. రెడ్ల అధికారము తగ్గినది మొదలు బెజవాడ ఖండము మొదలు కర్నూలు జిల్లా తుదవఱకుఁ గలదేశమంతయు బెజవాడ రాజధానిగాఁ గలసూర్యవంశము వసిష్ఠగోత్రము గలసింగిరిరా జను నొకరాజు స్వాధీనములో నున్నట్లును, అతఁడు నాతనిపిమ్మట రాజ్యమునకు వచ్చిన అతనివంశస్థులును గర్ణాటకప్రభుఁ డగుబుక్కరాజు నతని వంశస్థులకు సామంత ప్రభువులుగా నుండి వ్యవహరించినట్లును " Local Records" లో గ్రంథదృష్టాంతములు పెక్కులు కానంబడుచున్నవి. ఇట్లుండఁ గృష్ణదేవరాయలు నాతనితండ్రి తాతలు కొండవీడు రాజ్యమును జయించి ఆక్రమించి రని చెప్పినమాట చరిత్రానుభవవ్యతీ రేక వాక్యముగాఁ బరిహరించవలసివచ్చినది. ఇఁక నీవెన్నెలకంటి సూరనకవి

శ్రీనాథునివిషయము.

శ్రీనాథాదుల కాలమునకుఁ దరువాతివాఁ డైనట్లు విష్ణుపురాణ కృతిపతి యగురాఘవరెడ్డి కృతులందిన తన పూర్వులంగూర్చి చెప్పిన యీ క్రిందిపద్యమువలనఁ దేటపడుచున్నది.

"క. అనవేమమండలేశ్వరుఁ, డును నళ్ళయవీరభద్రుఁడును మొదలుగఁ గ
     ల్గినతొంటిరెడ్డిరాజులు, ఘనకీర్తులు గనిరి కృతిముఖంబున ననుచున్."

క్రీ. శ. 1435 సంవత్సర ప్రాంతములయం దుండిన వీరభద్రరెడ్డి తనపూర్వులలో నొకనిఁగా గృతిపతియైనరాఘవరెడ్డి చెప్పుటచేత