పుట:Kavijeevithamulu.pdf/678

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

672

కవి జీవితములు.

అంతమాత్రముచేతఁ బైవీరభద్రరెడ్డి రాఘవరెడ్డి పూర్వులలో నొకఁడని యూహించి. దానింబట్టి అతనికాలము నిర్ణయింపఁ గూడదు. పూర్వపు రెడ్డిరాజులను జెప్పునప్పుడు రాఘవరెడ్డి రాజు లనఁదగినవారిపై రెడ్లలోఁ జివరవాడగు వీరభద్రరెడ్డిని స్మరియించి అతఁడు తుదగాఁ బూర్వ మందుండు రెడ్డిరాజులలోఁ గొందఱు కృతినంది రనిచెప్పె. ఈరాఘవ రెడ్డియొక చిన్న సంస్థానాధిపుఁడగుటచేత రాజశబ్దవాచ్యుఁడు కాఁడు. ఇతని సంస్థానము కర్ణాటప్రభువుల పరిపాలనలోని దగుటచేత నానైచ్యమును దెల్పుకొనక తానుగూడఁ దనకంటెఁ గొప్పవా రగురెడ్డిరాజులవిధముగాఁ గృతినందినట్లు తెల్పును. వీరభద్రరెడ్డియనంతర మనఁగా శా. స. 1352 సంవత్సరమును తత్సమీపకాలములో నాతనితమ్ముం డగు దొడ్డయరెడ్డి ఆరాజమహేంద్రవరప్రాంతములోని కొంత దేశమున కధికారము చేసినట్లుగా నొకతామ్రశాసనము గోదావరీజిల్లా రామచంద్రపురముతాలూకా కొంకుదురుగ్రామములోఁ గాన్పించుచున్నది. వీరభద్రరెడ్డి కవ్యవధిగా రాజ్యమునకువచ్చియున్నయీ దొడ్డారెడ్డిపేరు విడువఁబడి వీరభద్రరెడ్డిపేరుమాత్రమే వివరింపఁబడుటచేత నీరాఘవరెడ్డి వీరభద్రరెడ్డితో సమకాలీనుఁ డై యున్నట్లును, కృతులనందిన రెడ్డివారిలో నప్పటికి వీరభద్రరెడ్డియే తుదివాఁడు నవుటంజేసి అతనిపేరుమాత్రమే స్మరించె. అతనిపైఁ గృతినిచ్చినకవి శ్రీనాథుఁడు. వీరరాఘవరెడ్డిపైఁ గృతినిచ్చినవాఁ డీవెన్నెలకంటి సూరనకవి. వీరిర్వురు రెండుస్థానములలోఁ గొంచెమెచ్చుతగ్గుగా నేక కాలములోనే కవీశ్వరులుగా నుండునపుడు కవీశ్వరుఁడు తనకాలములో నుండినమఱియొకకవీశ్వరుని పూర్వకవులలోఁ జేర్చి యేల చెప్పును. ఆకారణమున నీసూరనకవివలన శ్రీనాథునిపేరు వివరింపఁబడనట్లు కానుపించును. ఇట్లు శ్రీనాథునిపేరు సూరనకవి వదలుటయే ఆ యిర్వురు నేకకాలమువారు కావచ్చు ననుదానిని స్థిరపఱుచుచున్నది.

ఈవెన్నెలకంటి సూరనకవి చరిత్రములోఁ జేర్చవలసినవి మఱి రెండుకథలున్నవి. అందు మొదటిది 'విక్రమార్కచరిత్రముఁ' గృతినందిన వెన్నెలకంటి సిద్ధమంత్రికథ యొకటియుఁ గృష్ణవిలాసమున రచియించిన వెన్నెలకంటి వేంకటాచలకవి చరిత్రమొకటియును, ఈరెంటిలో