పుట:Kavijeevithamulu.pdf/664

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
658
కవి జీవితములు.

(1) పైవారిలో నొకటి రెండుగుర్తులు గలవారిచరిత్రము కొంత దెలియఁదగియున్నది. అందు మొదటివా డగుబసవరెడ్డి కటకాధిపుఁ డగు గజపతిరాజుచేత పల్లకి బహుమానము నందె. కర్ణాటప్రభునిచేత నాఎకరాజ్యభోగముల గైకొనియె. మలకవజీరులను సాధించె. తెలంగాణ (probably Telingana) భూములలోనుండెడు మన్యరాజులచేత పన్నులు గ్రహించె. దీనిం దెల్పుపద్యమును వివరించెదను.

"సీ. కటకాధిపతి యైనగజపతిరాజుచేఁ, బ్రతి లేనిపల్లకిపదవి నందె
      మహిమచేఁ గర్ణాటమండలాధిపుచేతఁ గడలేనిరాజ్యభోగములఁ గాంచె
      ప్రౌఢపౌరుషమున రాజిల్లి మెఱయఁగా, మలకవజీర్ల కుమ్మలిక జేసెఁ
      దెలగాణభూములఁ గలమన్నెవారిచే, బలవంతముగను గప్పములు గొనియెఁ

తే. జటుధాటీనిరాఘాట ఘోటకావ, లీఖురోద్థూత నిబిడధూలీనిలిప్త
    మండితాశాంగ నాకుచమండలుండు, బాహుబలశాలితమ్మయబసవవిభుండు."

పై బసవారెడ్డియు నాతని తమ్మలు శిష్యులుగాఁ గల్గిన యొక మహాత్ముఁ డుండెననియు నాతనిపేరు పంగులూరి యన్నయ యని యుఁ గలదు. అతనికి 'ఘోడియరాయ' బిరుదు గలదు. అట్టిపంగులూరి యన్నయాచార్యుని కటాక్షము నంది పై బసవరెడ్డి సమస్తైశ్వర్యముల నందె నని యున్నది. ఈపంగులూరి యన్నయ మిగుల విశేషజ్ఞుఁ డని సూరకవియు యాతనిం గూర్చి చేసిన వర్ణనంబట్టి యూహించ వలసియున్నది. ఆవర్ణన యెట్లున్న దనఁగా :-

"క. వీరుల కెల్లను గురుఁడై, రారాజులపూజలింగమై సుకవిమనః
     పూరితఘనవితరణవి, ద్యారసికుఁడు పంగులూరి యన్నయ వెలసెన్.

సీ. వినుతనానావేదవేదాంగశాస్త్రపు, రాణేతిహాసనిర్వాహకుండు
    శైవవైష్ణవసౌరశాక్తగాణాపత్య, మంత్రతంత్రాగమమర్మవిదుఁడు
    పరమపావనపరాపశ్యంతి మధ్యమా, వైఖరీమార్గప్రవర్తకుండు
    ఆధారమణిపూరకాది పంకజపత్త్ర, నిక్షిప్తపంచదశాక్షరుండు.

తే. కావ్యనాటకాలంకార భవ్యమూర్తి, పరమగురుసంప్రదాయప్రభావనిరతుఁ
    డగుచు ఘోడియరాయవిఖ్యాతినొందె, పంగులూరన్న యార్యుండు బ్రహ్మవిదుఁడు."