పుట:Kavijeevithamulu.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

657

గ్రామంబునకుఁ జనియె. ఇట్లు వచ్చి వెంకన్నకవితో నా సభలో జరిగిన వృత్తాంతమంతయుఁ దెలుప నాతం డాపండితుని సంతసించితివిగదా యని యడిగిన నాతండు బ్రహ్మానందభరితుం డై నేను పట్టినది చింతకొమ్మ కాదా ? నా కొకలోపముండునా యనిచెప్పి వారిరువుర వలన ననుజ్ఞాతుం డై నిజనివాసగ్రామంబునకుఁ జనియె. ఇది వెన్నెలకంటివారి దౌహిత్రు లగుమోచెర్లవారివృత్తంతము.

కృతిపతి వంశావళి.

ఈవిష్ణుపురాణమునకుఁ గృతిపతి రావూరి బసవ భూపాలుని కుమారుఁ డగురాఘవభూపాలుఁడని వక్కాణించితిమి. అం దాతని వంశావళి విపులముగా వివరింపఁబడినది. దానిసంగ్రహము నీక్రిందవివరించెదను.

శూద్రజాతి అందు అన్న వేమభూపాలుఁడు పుట్టినపంటకులములో