పుట:Kavijeevithamulu.pdf/665

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

659

అనియున్న యీస్తోత్రముంబట్టి యితఁడు శివాద్వైతిగాఁ గాన్పించు.

(2) రాఘవరెడ్డి విశేషములు.

ఈ రెడ్డి తనతండ్రివలెఁ గాక తాను వైష్ణవమతప్రవిష్టుఁడై యొకవైష్ణవుని తనకు గురువుం జేసికొనియె. అతనిపేరు సింగరాచార్యుఁడు. ఆసింగరార్యుఁడు తిరుమల తాతా చార్యుని మనుమఁడని చెప్పంబడినది. ఆ యిర్వురినడుమ నున్న వారిపేరులు చెప్పంబడలేదు. మొదట సింగరాచార్యులవిశేషములం దెల్పి యనంతరమతనిం గూర్చి ఆగ్రంథములోనే అచ్చటచ్చట వివరింపఁబడినపద్యములం జూపెద. ఎట్లన్నను.

"క. ఆతనియాచార్యుఁడు వి, ఖ్యాతయశోధనుఁడు సింగరార్యుఁడు వెలసెన్
     భూతలమునందుఁ దిరుమల, తాతయవంశమున సకలధర్మజ్ఞుం డై.

సీ. వేదాంతవిద్యావివేకి షడ్దర్శన, పారంగతుఁడు పరాపరరహస్య
    వేది బ్రహ్మాండాది వివిధ పురాణజ్ఞుఁ డసమానధర్మశాస్త్రాభినేయ
    కుశలుఁడు పరమార్థకోవిదుం డఖిలాధ్వ,రక్రియానిపుణుఁడవక్రకావ్య
    నాటకాలంకారనానాకళాభిజ్ఞుఁ, డుభయభాషాకవిత్వోజ్జ్వలుండు

తే. పరమవైష్ణవమార్గతత్పరుఁడు కీర్తి, ధనుఁడు తిరుమలతాతయ్యమనుమఁ డైన
    సింగరాచార్యు గురువుగా సేవజేసి, రమణఁజెలువొందెబసవయరాఘవుండు."

షష్ఠ్యంతములలో నీరాఘవరెడ్డి తిరుమలతాతాచార్యుని శిష్యుఁ డనియేయున్నది. ఎట్లన్నను :-

"క. తిరుమలతాతయదేశిక, వరశిష్యున కనుపమేయవైదుష్యునకున్
     పరభూపాలతమస్సం, హరణాదిత్యునకుఁ బల్లవాదిత్యునకున్."

అష్టమాశ్వాసాంతమున మఱియొకపద్య మున్నది. అందు సింగ రార్యుఁడు తిరుమలతాతాచార్యవంశ్యుఁడుగా వివరింపఁబడె. ఎట్లన్నను :-

"క. తిరుమలతాతయవంశా, భరణశ్రీసింగరార్యపరమగురుకృపా
     పరిపూర్ణహృదయయాచక, వరచేతఃకమలినీదివాకరమూర్తీ."

ఈ శింగరాచార్యుఁ డేకాలపువాఁడో తెలిసిన నతనిశిష్యుం డగు రాఘవరెడ్డికాలంబును, అతనిపైఁ గృతినిచ్చిన వెన్నెలకంటి సూరన కవికాలమును విస్పష్టంబగును. ఇదివఱలో నావలనఁ బింగళిసూరన