పుట:Kavijeevithamulu.pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

645

గావున నందులోని యనేక భాగములు ఖిలములైనవనియు నిట్టులే మఱికొన్ని వృత్తాంతంబులు చేర్చియొకపద్యము చెప్పె. దానింబట్టి చూడ నీపోతరాజునకును సింగమనీనికిం గల విహితవిశ్వాసములు బోధయగును. ఆపద్యానుసారముగాఁ జూచిన నాయిర్వురకును విరోధ మున్నట్లు కాన్పించునుగాని విహితమున్నట్లు కాన్పించదు. దానినూహించుటకుఁ బూర్వమాపద్యము నీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

"సీ. ఘనఁడు పోతనమంత్రి మును భాగవతము ర, చించి చక్రికిసమర్పించు నెడల
      సర్వజ్ఞసింగయక్ష్మావరుం డది దన, కిమ్మని వేడిన నీయకున్న
      నలిగి యాపుస్తకం బవనిఁ బాఁతించినఁ జివికి యం దొకకొంతశిథిలమయ్యె
      గ్రమ్మఱ నది వెలిగందలనారప, రాజును మఱి బొప్పరాజు గంగ
      రాజుమొదలగుకవివరుల్ దేజమెసగఁ, జెప్పి రాగ్రంథములయందె తప్పలొదెవెఁ
      గాని పోతకవీంద్రునికవనమందు, లక్షణం బెందుఁ దప్పునా దక్షహరణ."

దీనింబట్టిచూడ సింగమనీనికిని పోతరాజునకు నెట్టిస్నేహ మున్నదో చూడనగును. ఈపద్యమునం గలలక్షణము(దీని పే రేలక్షణసారసంగ్రహము) తిమ్మకవివలన శా. సం. 1662 అనఁగా క్రీ. శ. 1740 నకు సరి యగురౌద్రిసంవత్సరమున రచియింపఁబడియె. దీనికి వ్యతిరేకముగా ఆ. 1860 సంవత్సరప్రాంతమున ఆంధ్రభాగవతమును ముద్రించినపండితులు పోతరాజు జన్మకర్మములు దెల్పు ననువచనగ్రంథమునుండి తాము పరిశోధించి వ్రాసితి మని కొన్ని క్రొత్తమాటలు వ్రాసిరి. దాని వివర మీవఱకే చేసియున్నాను. పై రెండుకథలలోఁ దిమ్మకవి వ్రాసినదే మధ్యాంధ్రమండలము నాఁ బరఁగువేంగీదేశములో వ్యాప్తమై యున్నది. తిమ్మకవినాఁటికే పైసర్వజ్ఞసింగమనీనికథ ప్రాచీనము. అట్లుండఁగా నాంధ్రభాగవతము ముద్రించినవారు మఱి నూటయిరువది సంవత్సరముల యనంతరకాలములోఁ దా మెద్దియో పోతరాజు జన్మకర్మములఁ దెలుప నున్న వచనగ్రంథముందెచ్చి తాము పరిశీలించితి మని మూలగ్రంథమును బ్రకటింపకయే వ్రాసినమాటలను నమ్ముట యుక్తియుక్తముగాఁ గాన్పించదు. కావున సింగమనీనికిని పోతరాజునకును విహితవిశ్వాసములు లే వనియే నిశ్చయింపవలసి యున్నది.