పుట:Kavijeevithamulu.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

646

కవి జీవితములు.

సర్వజ్ఞసింగమనీఁడు పోతరాజును భాగవతము తనకుఁ గృతియిమ్మని యడుగుటయు దానిని స్పష్టముగా నీయనని పోతన తిరస్కరించెననుటయు యు క్తియుక్తముగాఁ గాన్పించదు. లోకములోఁ గవులు తాము గ్రంథములు రచియించి ప్రభువులపైఁ గృతినీయ ననుగ్రహింపుఁ డని యాశ్రయించుటయు, నట్టిగ్రంథముల గృతినంద నిష్టము గలవారు ఆగ్రంథమునకుఁ దగు సత్కార మెంతో దానిం జేయుటకుఁ తమరు చాలియుందురో లేదో చూచుకొనుటయు, నట్టిగొప్పవ్యయ మవశ్యమో కాదో చూచుకొని యనంతర మట్టి గ్రంథము నందలేమని చెప్పుటయును కవి కది సమ్మతము కానియెడల నాప్రభువును వదలి మఱియొకప్రభువు నాశ్రయించుటయు నున్నది కాని సింగమనీనివలె నొక గ్రంథము నాకుఁ గృతియియ్యవలె నని స్వయముగ యాచించుటయు, నట్లు యాచించు ప్రభుని నీ వీగ్రంథమునకుఁ గృతిపతివి కాఁదగవు కావున నే నీయను పొమ్మని పోతన మూర్ఖించి చెప్పుటయు లోకానుభవవ్యతిరేకమై యున్నది. ఇటులఁ గానిచో గ్రంథమెందులకు బహుకవికృతమై యున్న దని ప్రశ్నము పుట్టఁగలదు. ఆప్రశ్నమున కీవఱకే కొంత యూహించి వ్రాసితిమి. గ్రంథము బాహుళ్య మైనది కావునఁ బోతరాజే తాఁగొన్నిస్కంధములును దనశిష్యులు కొన్నిస్కంధములు విభజిం చి కొని ముగించినట్లు తోఁచెడిని. దానికి దృష్టాంతముగాఁ గేవలము వేదాంతరహస్య ప్రతిపాదకంబు లగు ద్వితీయ స్కంధము మొదలగువేతాంతభాగములును ప్రహ్లాదచరిత్రము గజేంద్రమోక్షణము, శ్రీరామ చరిత్రము, దశమస్కంధపూర్వభాగము సత్యభామయుద్ధము మొదలగు ప్రసిద్ధకథలన్నియుఁ బోతరాజ కృతములే యగుటయు సామాన్యకథా భాగములుమాత్రమే తచ్ఛిష్యకృతము లగుటయుఁ గాన్పించుకావున పోతన తనకిష్ట మైనభాగములును ననశిష్యులకు లొంగనిభాగములను దా స్వయముగాఁ గైకొని యాంధ్రీకరించిన ట్లూహించుటయే యుక్తి యుక్తముగా నున్నది. ఇఁక భాగవతమును సింగమనీఁడు పాఁతివేయించిన