పుట:Kavijeevithamulu.pdf/650

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
644
కవి జీవితములు.

"(vide 'Row Vamsa Charitra Tilaka translated by one Nadakuditi Seetanna, printed and published in 1884) at page 16, we find the following ː- Anapotam Naidu had a son named Sarvagana Singama Naidu who was well versed in, as well as, in other branches of learning He collected a large army and conquered the ports of Methuku and Kylasa in the west and held them as Jaghire. He patronized many poets, Philosophers, and Metaphysicians of the day. Panditaraya, the celebrated Telugu translator of Naishadha and Kasikhanda, i. e., Sreenadha and several others were highly respected and honored."

పైగాథనుబట్టిచూడఁగాఁ బండితరాయలు నైషధ, కాశీఖండములఁ దెనిగించిన శ్రీనాథకవి మొదలగువారును సింగమనీనివలన గౌరవింపఁబడిన ట్లున్నది. కాని అతనియాస్థానవిద్వాంసులుగాఁ గానీ కవులుగాఁ గానీ యున్నట్లు కనఁబడదు. ఇదియునుగాక సింగమనీనికిఁ గల యబిరుచి సంస్కృతభాషలోఁగాని యాంధ్రంబునఁ గా దని అతనివలన రచితము లైనసింగభూపాలీయము నాటకపరిభాష మొదలగుగ్రంథములం బట్టి కాన్పించును. అట్టివాఁ డాంధ్రములో వారనారిపై నొకదండకముం జెప్పించి దానికిఁ దాను కృతిపతి యై యుండ నంగీకరించె నని పుట్టింపఁబడినకథయే పొసఁగియుండలేదు. ఆసింగమనీనియోగ్యతామహిమంబుల రెంటూరి రంగరాజకవి తనభానుమతీపరిణయగ్రంథములోఁ గృతిపతివంశాను వర్ణనములో నీక్రింది విధంబుగా వివరించె. ఎట్లనఁగా.

"సీ. ఏమహాసేనాని యిద్ధతేజోరాశి, హితధనంజయజయోన్నతి వహించె
      నేభోగిభూషణు హేలాధృతిగుణంబు, తుహినాప్తజాతసంస్తుతి భరించు
      నేహ స్తిబలహారి బాహువిక్రమలీల, గర్వాంధకచ్ఛదకలనఁ గాంచు
      నేమహాపతి ధర్ముసామోపయత్నంబు, సిద్ధసంకపరాజిని మెలంగు

గీ. వేసమాశ్రితవిద్యాధరేంద్రశక్తి, సుగుణగణపాలనార్చితస్ఫూర్తిఁ గాంచు
   నట్టిసర్వజ్ఞమూర్తి నా నలరుచుండుఁ, జిత్రకళమీఱి సర్వజ్ఞసింగశౌరి."

కూచిమంచి తిమ్మకవిసార్వభౌముఁడు తనలక్షణగ్రంథములో భాగవతగ్రంథము రచియించిన బమ్మెర పోతరాజునకును పైసింగమనీనికిని బలవద్విరోధంబు కలదనియు నాకారణమున నాపోతరాజకృతభాగవతమురూపుమాపఁదలంచి దానిని భూమిలోఁ బాఁతించెననియుఁ