పుట:Kavijeevithamulu.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

618

కవి జీవితములు.

కానియక్షర మం దుంచి దాని ప్రయోగంబునకుఁ జర్చించుటకుఁ గారణంబుమాత్రము కానరాదు. వీనిప్రయోగంబునకు శాస్త్రంబు సమ్మతించినను గ్రంథంబుల దాని నుంచకున్న బాధకం బేమి కలదు. ఇదియకాదు సర్వభాషలు దెనుఁగుతోఁ గలిపి ప్రయోగింపవచ్చును. ఇతరభాషలోనియక్షరము మనభాషలో నుంచి దానిప్రయోగంబునకు సంశయించుకంటె నాయక్షరమును దొలఁగించి మనభాషలోని యక్షరమునేగొను టెంతయు శ్లాఘనీయంబుగాదె. ఱకారంబునకుంబోలె ళకారంబునకు సంస్కృతంబున నొకవివాదము సంభవించుచున్న కొందఱు (ళ) యీశ్వరఢక్కచే నుద్భవించలేదనియుఁ గావున నిది వర్ణ సమామ్నాయంబున లేదనియు ళకారయుతంబు లైనశబ్దములలో లకార ముంచి యుచ్చరించుటయేయుక్త మని వాదించుచున్నారు. దీని కనేకులు పండితులు సమ్మతించియున్నారు. ఈశ్వరఢక్కవలనఁ బుట్టినలకారమునకుఁ గొన్నికొన్ని దేశములవారిచే నిట్టియుచ్చారణభేదంబు గల్పింపఁబడినది. దాక్షిణాత్యులుదీనినే తఱుచుగ గురువుగ నుచ్చరించుచున్నారు. ఉత్తరదేశవాసులు దీనిని స్వభావసిద్ధ మైనయుచ్చారణతోఁ బల్కుచున్నారు. మధ్య దేశస్థుల మైనమన ముభయోచ్చారణలును వినియున్నాము కావున నారెంటినిగూడఁ బల్కు చున్నాము. ఇంతమాత్రముచే లకారముయొక్క గురురూపము శివునిఢక్కచే నుత్భవించినట్లే లెక్కించి వాక్యంబు దిద్ద నలవికాదుగదా. తెలుఁగున ఱకార రేఫములకు నుచ్చారణయం దిట్టి సామ్యమే యున్నది. ఇందలిపండితులును శాస్త్రసమ్మతంబైన రేఫోచ్చారణంబేయుంచుట మే లనిన మనకు ఱకారముంగూర్చి మాటలాడు నవసరంబే లేదు. మనకే కాదు తొంటికవులలోఁగూడ నిట్టి భేదాభిప్రాయంబులు గలవు. దీనికి దృష్టాంతముగఁ గవిత్రయము వారిమతంబు చూచిన వృత్తాంతమంతయు గోచరంబగు. నన్నయభట్టున కున్నంతయిష్టంబు తిక్కనసోమయాజికి వీనిమైత్త్రి లేమికి లేదు. ఎఱ్ఱప్రెగ్గడయుం దిక్కనమార్గంబునే యవలంబించినట్లు కానంబడు. ఈ