పుట:Kavijeevithamulu.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

617

బ్రమయుదురు. ఇట్టిచోటనే యప్పకవి దోషబాహుళ్యంబుగా వ్రాసె. ఇట్లువ్రాసినవాఁ డన్నిశబ్దంబులును రూఢముగా నెఱింగించినవాఁడును గాఁ డయ్యె. [1]తా వ్రాసిన దానినైన దా సమర్థింపలేఁ డయ్యె. ఈతని యనంతర మహోబలపండితుం డీరేఫయుగవిషయం బెంతయు వ్రాసి వీనిమైత్త్రికి సమ్మతించినవారిని మఱియు నిందించె. భాగవతంబుఁ దెనిఁగించిన బమ్మెరపోతరాజునకును రాఘవపాండవీయంబు వ్రాసినపింగళసూరన్నకు ననామకకవిద్వయ మని పేరుంచె. చూడుఁడు తావ్రాసినదే యథార్థ మని యితఁడు మహాకవుల నిందించె. అహోబలపతి యనంతరము మఱికొందఱు ప్రత్యేకంబు దీనివిషయంబే వ్రాసి పరుష వాక్యంబులచే దీనిమైత్త్రి తప్పింప యత్నించిరి. ఇంతియ యోచించిరిగాని దీనిలోని ముఖ్యాంశంబు గనుపఱుపరయిరి. అది యటుండనిండు. మన మీ యక్కర మెక్కడనుండి వచ్చినదియో యోచించి దానియుపయోగముం గూర్చి పిమ్మట నాలోచింతము.

ఆంధ్రాక్షరవిమర్శనము.

ప్రప్రథమంబునఁ దెనుఁగుబాసలోనివర్ణంబులఁ దేటపఱుతము. అ ఆ, ఇ ఈ, ఉ ఊ, ఎ ఏ ఐ, ఒ ఓ ఔ, ౦-ఁ, కగ, చౘ, జౙ, టడణ, తదన, పబమ, యరలవసహళ. అనునక్కరములు ముప్పదియాఱు. ఇవియే యచ్చ తెనుఁగు వర్ణంబు లైనట్లు వ్యాకరణంబులలో స్పష్టం బగు. అందు చే ఱకారంబు మొదటనుండియు నుండినట్లు నిశ్చయింపఁ దగియున్నది. అట్లే కాకున్న నీభాషకు వర్ణంబులు ముప్పదియేడు గాకుండునే. అట్లైన నిఁక నీవర్ణం బెచ్చటిదో యరయవలయు. ఇది కన్నడభాషలోని దని చెప్పంబడు. మనదేశపు రాజు లాదేశంబుం జయించి యచ్చో గాఁపురమున్న కాలంబులు కొన్ని గలవు. అపు డీయక్షరము మనకు సంప్రాప్తం బయియుండు. ఈఱకారమునకు మన రేఫమునకు సంబంధంబు లేకుండుటం జేసియే సూత్రకారులు దీనికి వైధర్మంబు సెప్పెరి. మనభాషలోనిది

  1. చేఱఁగుశబ్దము లఘురేఫ ముంచి వ్రాసె. దాని కితరలాక్షణికులు సమ్మతింపరైరి.