పుట:Kavijeevithamulu.pdf/625

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

619

మువ్వురింగాక తక్కినవారిం జూచిన వారికి నిట్టిభేదంబే గలదు. అందుఁ బోతనామాత్యుని కాలీనులచే నిది మిగులఁ బాటింపంబడినట్లు గానరాదు. కృష్ణరాయలకాలీనులు తాము కర్ణాటదేశంబున నుండుటంజేసి దీని నెంతయుఁ బాటించినట్లు గాన్పించు. కర్ణాటదేశ వాసంబు లేకపోయినతోడనే మనవారికి వీనిమైత్త్రి లేమికి మిక్కిలి యాదరంబు లేదయ్యె. మఱికొంతకాలంబున కప్పకవి దీనివైధర్మ్యమును మరల నుద్ధరించి దీని మైత్త్రికి సమ్మతించినవారిని గుకవులనియు నాగ్రంథంబులు సలక్షణంబులు గావనియుం బల్కె. నాఁటనుండియు గొందఱు కొందఱు వ్యాకరణకారులు వీనిమైత్త్రి తప్పింప నతితీక్ష్ణముగ వ్రాసిరి. వీరందఱును ఋకారంబునకును రేఫమునకు మైత్త్రియుండవచ్చు ననిరి. దానికి కారణంబు రేఫలోనిభాగంబే కావున నట్లున్న దోషము లే దనిరి. ఱకారముమాత్రము రేఫములోనిది గా దని వారియభిప్రాయము. ఈ రేఫమే గురువుగ నొకపరియు లఘువుగ నొక పరియు నుచ్చరింపఁబడు ననుచో ఋకారంబున కున్నంతమైత్త్రియైన లేకుండునా యని యేల యూహింపఁ గూడదు అచ్చగుఋ కారమునకును, హల్లగురేఫమునకును మైత్త్రి వీరికి సమ్మతమైయుండ వీరికి గురులఘు రేఫములమైత్త్రి సమ్మతించిన దోష మేమిగలదు. సూత్రమునఁ జెప్పఁబడినది కావున దీనికి నేమియుఁ జేయఁగూడ దని యనెద రేమో సూత్ర మున్నను బ్రయోగంబున భేదంబులు గాన్పించుచుండ నాసూత్రమునకు విశేషవిధానములు కల్పించుచుండ నిచ్చో నది యేల కూడదు. ప్రయోగంబు ననుసరించి సూత్రముల నేఁటివఱకును గల్పింపఁబడుట లేదే? పండితులును బుద్ధిమంతులును భాషలోని చిక్కులు తప్పింప యత్నింపవలయుఁగాని యిట్టిపట్టునే యవలంబించిన నేమిలాభంబు ? ఈ రేఫయుగమైత్త్రి దోషమును సవరింపకుండిన గ్రంథంబులన్నియు నలక్షణంబులు గావు. వైకల్పికమైత్త్రి కైన సమ్మతింపక తప్పదు. అటుగాకున్న ప్రతిగ్రంథంబులో నీలోపం బొకమాఱైనఁ గాన్పించి దా