పుట:Kavijeevithamulu.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బమ్మెర పోతరాజు.

609

జేయంబడిన "వీరభద్రవిజయవివేకము" అను నొకదీర్ఘోపన్యాసములో భాగవత గ్రంథకర్త కాఁడని సిద్ధాంతమాయెఁ గావునఁ బాఠకు లీవ్యాసాంతమందుఁ బొందుపఱచి యుంచిన 'వీరభద్రవిజయ వివేక' ముం జదివి తమసందియములు వారింపఁ గోరెదను. భక్తాగ్ర గణ్యుం డగునీపోతనామాత్యుండు పదలాలిత్యంబునకుమిగులః బ్రసిద్ధుండు ఇట్టికవికృతగ్రంథంబునఁ గొన్నిస్థలంబుల నీతనికవనంపుజాడలఁ జూడనోడుదుము. అట్టిపట్లు రచించినవాఁ డీతం డౌనా యని శంకవొడమెడిని. ఆశంక నిష్కళంకంబుసేయు నొకవృత్తాంతంబు గలదు. దానినీక్రింద

పోతన భాగవతముం దాఁచుట.

వివరింతము. ఈకవి యాంధ్రభాగవతంబు పూర్ణంబుసేసి యది యైహిక సుఖేచ్ఛాపరు లగుపామరులకునధ్యేయంబైన వేదాంతార్థంబులగౌరవంబు సెడు నని యెంచి ప్రచురింపక పఠనార్హు లగుముముక్షుజనుల వెదుకుచు నుండె. ఇట్లుండ నిర్యాణసమయం బగుడుఁ దనకుమారుం డగు మల్లనను రావించి యతనికి నఖిలరహస్యార్థప్రతిపాదకం బగుస్వకృత భాగవతం బిచ్చి దానిని సాధనచతుష్టయసంపన్ను లగుముముక్షువుల కధ్యేయం బగున ట్లొనరింపు మని తెల్పి తాఁ బరమపదప్రాప్తుం డయ్యె. అంత మల్లన పితృవాక్యపరిపాలనేచ్ఛాపరుం డై తదర్హజనాన్వేషణంబు సేయుచు దానిఁ బేటికాంతర్గతంబు సేసి దేవతార్చనావితర్ది సమీపంబున నుంచి సమంచితభక్తిఁ బూజించుచుండె. అనంతర మాతండు తనకును గాలావసానం బగుడు నాత్మసఖుండును సహా ధ్యాయియు నగు వెలిగందలనారయకవిం బిలిచి రహస్యంబుగఁ దనపైతృకథనంబుఁ గొమ్మని దేవతార్చనపూర్వకంబుగ నా పేటిక నిచ్చి తా లోకాంతరగతుండయ్యె. పిమ్మట నారయ తనగురుధనంబు నారయ దానిం దీసి యందుఁ జీనాంబరముల నతిశిథిలంబు నొందియున్న జీర్ణ భాగవతంబుఁ జూచి యది స్వగురుప్రణీతంబ కాఁ దెలిసి శైథిల్యంబు నొందుట కెంతయు డెందంబునఁ గుంది దానిఁ గట్టి మరల నొకచోఁ బెట్టియుంచి నాఁటిరేయి