పుట:Kavijeevithamulu.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

610

కవి జీవితములు.

దానింగూర్చి చింతింపుచు నిద్రింపఁ బోతనామాత్యుం డాతనికి స్వప్నంబునఁ గాన్పించి యిట్లనియె. ఓయీ దీని నే నీవఱకు లోకంబున వ్యాపకంబవున ట్లొనరింపకుండుటం జేసి యీగతి వగవవలసివచ్చె. ఇపుడు విభ్రష్టంబు లైన ఘట్టంబుల న ట్లింపు దోఁప సంపూర్ణంబు సేసి తూర్ణంబ దీని జగద్య్వాపక మవున ట్లొనరింపు మని తిరోహితుం డైన, నారయ మేల్కాంచి స్వప్నంబు తెఱంగు పోతనామాత్యశిష్యులకుఁ దెల్పె. వారును నాతనిం గూడి దానినంతయు సంపూర్ణంబు సేసిరి. అని కొందఱ మతము. ఇందుఁ గొంతపూర్వపక్ష మాయెను. దానిని మఱియొకచోఁ

పోతనకవనంబును శిష్యకవనంబును.

దెల్పితి. పోతనామాత్య కవనంబునకుఁ దచ్ఛిష్యజన కవనంబునకుఁ గల భేదంబులు సమానవర్ణన లున్నతావులఁ గొన్నికొన్నిపద్యంబులఁ జూచిన గోచరంబగు. దీనికిఁ దార్కాణంబుగ నష్టమంబునఁ ప్రహ్లాదునిపద్యము.

"సీ. మందార మకరంద మాధుర్యమునఁ దేలు,మధుపంబు వోవునే మదనములకు
      నిర్మలమందాకినీవీచికలఁ దూఁగు, రాయంచసనునె తరంగిణులకు
      లలితరసాలపల్లవ ఖాది యై చొక్కు, కోయిల సేరునే కుటజములకుఁ
      బూర్ణేందుచంద్రికా స్ఫురిత చకోరక, మరుగునే సాంద్ర నీహారములకు

తే. నంబుజోదరుదివ్య పాదారవింద, చింతనామృతపానవిశేషమత్త
    చిత్త మేరీతి నితరులఁ జేరనేర్చు, వినుతగుణశీల మాటలు వేయు నేల."

ఇది పోతనామాత్యకవనంబు. తచ్ఛిష్యకృతం బగుదశమోత్తర భాగంబున రుక్మిణితోఁ గృష్ణుండు విరసోక్తు లాడిన యనంతరము శ్రీకృష్ణుఁ డాపెను దేర్చియుండ ననంతర మాయమ శ్రీకృష్ణు నుతించుతఱి పద్యము :-

"సీ. నీరదాగమమేఘనిర్యత్పయఃపాన, చాతకం బేఁగునే చౌటిపడెకు
      పరిపక్వమాకందఫలరసంబులఁ గ్రోలు, కీరముల్ జను నె దుత్తూరములకు
      ఘనరవాకర్ణ నోత్కలికమయూరము,ల్గోరునే కఠినఝల్లీరవంబు
      కరికుంభపిశితసద్గ్రాసమోదితసింహ, మరుగునే శునకమాంసాభిలాషఁ

గీ. బ్రవిమలాకార భవదీయపాదపద్మ, యుగసమాశ్రయనైపుణోద్యోగచిత్త
    మన్యుఁ గోరునె తన కుపాస్యంబుగాఁగ, భక్తమందార దుర్భవభయవిదూర."