పుట:Kavijeevithamulu.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

608

కవి జీవితములు.

వనుం డగుశ్రియఃపతి అట్లు పరితాపంబుపా లగుట భక్తులయెడఁ దనకుండుకారుణ్యంబు జూపుట కేకదా. ఇదియ నాకుంబోలినయర్థంబు. సహేతుకంబు గాకున్న భక్తికిం గొదువయేమి. అనుడు శ్రీనాథుం డూరకుండె. మఱికొన్నిదినంబు లైనతర్వాతఁ బోతనామాత్యుండు తనమనంబున శ్రీనాథుండు శ్రీనాథు నాడిన వాఁడిమాటలవేఁడిమి సహింపలేక యథార్థం బాతనికి గోచరం బగున ట్లొనరింపఁ దలంచి యాతనిపుత్త్రుని దాఁచి బావా నీకొడుకు నూతం గూలె నని తెల్పె. శ్రీనాథుం డాపల్కులు విని మనంబునఁ గలఁగి దిగ్గున లేచి కళవళపడి యెచ్చ టెచ్చట నని విలపించుచుఁ బరువులిడఁదొడంగె. దానిం జూచి పోతన యాతనితో నిట్లనియె. ఓయీ నిలు నిలుము. ఊరక చనెదవేమి. త్రా డేది నిచ్చెన యేది. ఇట్లు విలపించుచుఁ జని నీవు నందుఁ గూలుదువుగాఁబోలు. అని యడ్డంబువచ్చి నిలిపిన శ్రీనాథుండు పోతనతో నిట్లనియె. వేగంబునఁ జని న న్నాకుఱ్ఱనిం గననిమ్ము. కన్నారం జూచినఁ గొంత వంత మాను. అనునాతనిం గాంచి పోతన యిట్లనియె. బావా జడియకుము. నీ కుమారుండు నూతం బడలేదు. గజేంద్రరక్షణంబునకు నార్తావనుం డగు శ్రియఃపతి యిటులనే పరితాపంబు నొందె. నీ వసమర్థుండవయ్యుఁ బరికరరహితుండవయ్యు మిన్నక చూచినంతనే కర్జంబగు నని తలంప నఖిల లోకాధీశ్వరుం డగుకరివరదుం డూరక యచ్చోటి కరిగినఁ గొఱఁత యొక్కటి గలదే. భక్తులయెడ భగవంతునకుం గలప్రేమ జనులకును నీకును గోచరంబు గా నే నట్లుపలికితి. నీవు వాగపరాధం బొనర్చితివి. కావునఁ బశ్చాత్తప్తుండ వై యాహరిశరణంబు వేఁడు మని నిజనివాసంబు కుంజనియె. ఇట్లనేకసమయంబులఁ బోతనామాత్యుండు భగవన్మాహాత్మ్య ప్రకటనంబు సేయుచు భాగవతంబుఁ దెనిఁగించి భగవదర్పణంబు సేసె. ఇం దీతండు శివపరాత్పరత్వము చెప్పకుంటం జేసి వాగ్దోషంబు సంభవించె ననియుఁ దద్దోషపరిహారార్థంబు వీరభద్రవిజయం బనునొకగ్రంథంబు వ్రాసి తత్పాపంబు పాపికొనె ననియుం గలదు. ఇటీవల నావలనఁ