పుట:Kavijeevithamulu.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

583

"పెద్దన ఆముక్తమాల్యద వ్రాసినప్పుడు తన్ను రాయలఁగా భావించుకొని వ్రాసెనుగాని పెద్దన యనుకొని వ్రాసియుండలేడు "సూక్ష్మంబు తెలిసిన నెక్కుసందియంబులు వీడును"

అనియున్న దానిం గూర్చి వ్రాయవలసినది యొక్కటిమాత్రమున్నది. ఆముక్తమాల్యద యేకారణమున నుద్దేశింపఁబడెనో, యెవరివలన నెపుడు రచియింపఁబడెనో ఆ మీమాంసపై యుపన్యాసమువలనఁ దేల లేదు. ఇపుడు పెద్దన కృష్ణరాయలుగా భావించి వ్రాసెను గావున గ్రంథమంతయు నట్లుగానే వ్రాసె ననియు నది యొక సూక్ష్మ మైనయంశం బనియు దీనిం దెలిసినపెక్కు సందియములు వీడు ననియు నున్న సిద్ధాంతమువలనఁ దేలినది ఏమియు లేదనియు, నేదియేని యొకయభిప్రాయము మనసులో నిమిడించుకొనినచో న్యాయము మనస్సునకుఁ బొడకట్టకయుండఁ దాఁ బట్టినకుందేటికిఁ గాళ్లు మూఁడని చెప్పెడు సిద్ధాంతము తోఁచును. అట్టిచో యుక్తిగాని, శాస్త్రముగాని నిలువంబడఁజాల వని తెలుపవలసినదై యున్నది.

పూ. 8. ఇంక విస్తరభీతిచే నెక్కుడుకారణంబులు వ్రాయ విరమించితిని. ఈమీఁదికారణములు బాగుగ గ్రహించిన నితరపక్షవాదంబు పూర్వపక్షంబు సేయ సులభంబు

స. 8. కాని యుపన్యాసకున కిక్కడికైనను గ్రంథవిస్తరభీతి కల్గినందుల కానందించవలసియుండును. తనకుఁ బాఠకుల కుపకారము చేయుఁగోర్కెయే యున్న యెడల నిదివఱలోఁ జెప్పిన యనేక పూర్వపక్షములు వదులుకొనియే యుండును. అపుడు దానికి సమాధానము వ్రాయువారికి గ్రంథము పెంచవలసినంత యవసరమే లేకపోవును. దానివలనఁ బాఠకులకు నతిసదుపాయము గల్గియుండును. ఇకఁ జెప్పవలసిన యుక్తులు లే వని యిదివఱలోఁ జెప్పిన యుక్తులే నీరసములగుటంజేసి యూహించవలసియున్నది. ఉపన్యాసకునియుపన్యాసము బాగుగ గ్రహించినపిమ్మట నముద్రితగ్రంథచింతామణి పత్త్రికాధిపతిగారు ఆముక్తమాల్యదకారుఁ డెవ్వఁడో, విష్ణుచిత్తీయ, మనుచరిత్రములఁ బూ